
పాపపశ్చాత్తాప పూజలు
బాడంగి మండలం కోడూరులోని కోడూరుమాత చర్చిలో క్రైస్తవులు పాపపశ్చాత్తాప పూజలను శనివారం నిర్వహించారు. ఏడు శనివారాలు శిలువ చెంతకు కార్యక్రమంలో భాగంగా తొలుత కోడూరు మాతను దర్శించుకున్నారు. కొవ్వొత్తులు వెలిగించి, టెంకాయలు కొట్టి ప్రార్థనలు చేశారు. మొక్కులు తీర్చుకున్నారు. పాపాపశ్చాత్తాప యాత్రలో పాల్గొన్నారు. ఫాదర్ యుగల్‌కుమార్ వినిపించిన క్రీస్తు సందేశాలు, బైబిల్ వాక్యాలను శ్రద్ధగా విన్నారు.
– బాడంగి

పాపపశ్చాత్తాప పూజలు
Comments
Please login to add a commentAdd a comment