వేడుకలోనూ రాజకీయ వేషాలు!
అదేదో రాజకీయ పార్టీ కార్యక్రమం కాదు. అలాగని ఓ రాజకీయ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమం అసలే కాదు. ప్రభుత్వ కార్యాలయంలో మున్సిపల్, మెప్మా అధికారులు సంయుక్తంగా నిర్వహించిన మహిళా దినోత్సవంలో జనసేన పార్టీ కండువాలు వేసుకుని కొందరు మహిళా కార్యకర్తలు హల్‌చల్ చేశారు. వీరిని చూసిన మున్సిపల్ చైర్మన్ ఎస్వీ మురళీ కృష్ణారెడ్డి అవాక్కయ్యారు. కాసేపు పక్కకు తప్పుకున్నారు. కండువాలు తీయకుండానే మున్సిపల్ కమిషనర్ రామలక్ష్మిని మున్సిపల్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో సత్కరించడం గమనార్హం. విషయాన్ని తాపీగా తెలుసుకున్న మెప్మా టీపీఆర్వో జగన్మోహనరావు మహిళలు వేసుకున్న కండువాలను తీయించినట్టు సమాచారం. – బొబ్బిలి
Comments
Please login to add a commentAdd a comment