15తో ముగియనున్న చెరకు క్రషింగ్
రేగిడి: మండలంలోని సంకిలి గ్రామం వద్ద ఉన్న ఈఐడీ ప్యారీ చక్కెర కర్మాగారంలో చెరకు క్రషింగ్ ఈ నెల 15తో ముగియనుందని యాజమాన్య ప్రతినిధులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2024–25 సంవత్సరానికి 3.25లక్షల మెట్రిక్ టన్నుల చెరకు క్రషింగ్ చేసినట్టు పేర్కొన్నారు. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం ప్రాంతాల నుంచి మిగులు చెరకును ఈ నెల 15లోగా కర్మాగారానికి తరలించేందుకు రైతులు ముందుకు రావాలని కోరారు. చెరకు క్రషింగ్‌కు సహకరించిన రైతులు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఉపాధి హామీ పనుల పరిశీలన
గజపతినగరం రూరల్/దత్తిరాజేరు: గజపతినగరం మండలంలోని పట్రువాడ, చిట్టేయవలస, దత్తిరాజేరు మండలంలోని ఇంగిలాపల్లి, గొభ్యాం గ్రామాల్లో జరుగుతున్న ఉపాధిహామీ పనులను ఎన్‌ఆర్‌ఈజీఎస్ డైరెక్టర్ షణ్ముక్ కుమార్ మంగళవారం పరిశీలించారు. ఫారం పాండ్‌లు, ఫిష్ పాండ్‌ల నిర్మాణంపై వేతనదారులకు పలు సూచనలిచ్చారు. వేతనదారులకు రోజుకు రూ.300 వేతనం తక్కువ కాకుండా పనులు కల్పించాలని ఫీల్డు అసిస్టెంట్లను ఆదేశించారు. ఉపాధిహామీ పనులతో సాగునీటి వనరులను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ఆయన వెంట కాలుష్య నింయత్రణాధికారి గోపీచంద్, డ్వామా పీడీ శారదాదేవి, అడిషనల్ కమిషనర్ శివప్రసాద్, ఎంపీడీఓలు కల్యాణి, రాజేంద్రప్రసాద్ ఏపీడీ రమామణి, ఏపీఓలు చప్పరామారావు, అప్పలనాయుడు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment