దార్శనిక పత్రాల రూపకల్పనకు కసరత్తు
విజయనగరం అర్బన్: వికసిత్ భారత్–2047 లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్ర, జిల్లాల సత్వర అభివృద్ధి కోసం స్వర్ణాంధ్ర పేరుతో దార్శనికపత్రాలు రూపొందిస్తున్నట్టు కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలిపారు. నియోజకవర్గాల వారీగా అభివృద్ధి సాధనకు దార్శనిక పత్రాలను రూపొందించాలని సంకల్పించామన్నారు. ఆయా నియోజకవర్గాల పరిధిలో అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకొని స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఆయా శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధుల సూచనలు, సలహాలతో నియోజకవర్గ అభివృద్ధికి అనుగుణంగా దార్శనిక పత్రాలను రూపొందించేందుకు కసరత్తు ప్రారంభించామన్నారు. జిల్లాలోని మంత్రులు, ఎంపీలు, శాసనసభ్యులు, మండలి సభ్యులు, జెడ్పీ చైర్మన్, కార్పొరేషన్‌ల చైర్మన్‌లు, ఇతర ప్రజాప్రతినిధుల సూచనలు, సలహాలు స్వీకరించేందుకు ఈ నెల 15న కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 10.30 గంటలకు సమావేశం నిర్వహిస్తామని తెలిపారు.
15న సలహాలు, సూచనల స్వీకరణకు సమావేశం
Comments
Please login to add a commentAdd a comment