
రైల్వే ప్లాట్‌ఫాంపై గుర్తు తెలియని మృతదేహం
విజయనగరం క్రైమ్: విజయనగరం రైల్వేస్టేషన్‌లో గుర్తుతెలియని 45 ఏళ్ల వయస్సు కలిగిన వ్యక్తి మృతదేహాన్ని రైల్వే పోలీసులు బుధవారం కనుగొన్నారు. ఇందుకు సంబంధించి జీఆర్‌పీ సిబ్బంది ఇచ్చిన వివరాల మేరకు విజయనగరం రైల్వేస్టేషన్‌లోని 4వ నంబర్ ఫ్లాట్‌ఫాం వద్ద నాలుగో రైల్వేలైన్ వద్ద సుమారు 5.6 అడుగుల మృతదేహం పడి ఉంది. చామనఛాయ రంగు, లేత నీలిరంగు దుస్తులు ధరించి ఆ వ్యక్తిని ఎవ్వరూ గుర్తించకపోవడంతో తామే మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని జీఆర్‌పీ హెడ్‌కానిస్టేబుల్ అశోక్ తెలిపారు. మృతదేహం ఆచూకీ తెలిసిన వారు ఫోన్ 9490617089,6301365605 నంబర్లు, ల్యాండ్ లైన్ నంబర్ 0891–2883218 నంబర్‌కు ఫోన్ చేయవచ్చని తెలిపారు.