
పాలనలో పంచాయతీరాజ్ వ్యవస్థ కీలకం
విజయనగరం: మహాత్మా గాంధీ కలలు కన్న గ్వామస్వరాజ్య స్థాపన, పాలనలో పంచాయతీరాజ్ వ్యవస్థది కీలకపాత్ర అని ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఉద్ఘాటించారు. జెడ్పీ సమావేశ మందిరంలో బుధవారం జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని నిర్వహించారు. ముందుగా జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పంచాయతీరాజ్ వ్యవస్థలో భాగస్వాములైన అధికారులు గ్రామీణ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని సూచించారు. మూడు గ్రామాల సర్పంచ్‌లు, ఇద్దరు ఎంపీడీఓలను సత్కరించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ ఆర్.వెంకట్‌రామన్, జెడ్పీటీసీ సభ్యులు కెల్ల శ్రీనివాసరావు, ఎం.శశికళ, వైస్ ఎంపీపీ అచ్చంనాయుడు, జెడ్పీ ఉద్యోగులు పాల్గొన్నారు.
జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు
జిల్లా పరిషత్‌లో ఘనంగా జాతీయ
పంచాయతీరాజ్ దినోత్సవం