
విజయనగరం
సోమవారం శ్రీ 28 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
ఆటాడుకుందాం రా..!
వేసవి వచ్చిందంటే చాలు పిల్లలకు ఆటలు గుర్తుకొస్తాయి. విద్యార్థులు వార్షిక పరీక్షలు ముగిసిన తర్వాత సేదదీరుతుంటారు. –8లో
‘చీపురుపల్లి మండలం మెట్టపల్లి గ్రామానికి చెందిన రమణ అనే ఉపాధ్యాయుడు చీపురుపల్లిలో సొంత ఇంటిని నిర్మించుకోవాలని ప్లాన్ అనుమతుల కోసం మేజర్ పంచాయతీ కార్యాలయానికి వెళ్లారు. దాదాపు రూ.లక్షా 4 వేలు చెల్లించాలని అక్కడి అధికారులు చెప్పడంతో కంగుతిన్న ఆయన కాగితాలు తీసుకుని వెనక్కి వచ్చేశాడు.’
‘చీపురుపల్లి పట్టణంలోని ఆంజనేయపురానికి చెందిన కలిశెట్టి రాము సర్వే నంబర్ 9/3, 4లోని సొంత స్థలంలో 2003లో ఇల్లు
నిర్మించుకున్నారు. అప్పట్లో మేజర్ పంచాయతీకి బిల్డింగ్ ప్లాన్ కోసం దరఖాస్తు చేసుకోగా నిబంధనల ప్రకారం ఫీజు చెల్లించి బిల్డింగ్ అనుమతులు పొందారు. ఆయన మరో రూ.1,27,050 చెల్లించాలని కొద్దిరోజుల
కిందట పంచాయతీ కార్యాలయం నోటీసు బోర్డులో అతికించారు. ఆయనకు ఇప్పుడు నోటీసు పంపారు.’
‘చీపురుపల్లి పట్టణంలోని లావేరు రోడ్డు
ప్రాంతానికి చెందిన గుసిడి సత్యం సర్వే
నంబర్ 73/1లోని సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకునేందుకు 2023లోనే మేజర్
పంచాయతీ కార్యాలయం నుంచి నిబంధనల ప్రకారం బిల్డింగ్ అనుమతులు పొందారు. మరో రూ.1,47,840 ఫీజు చెల్లించాలంటూ పంచాయతీ పంచాయతీ కార్యాలయం వద్ద నోటీస్ బోర్డులో ఆయన పేరు పెట్టారు.
నోటీసులు కూడా పంపించారు.’
చందనోత్సవానికి
ఆర్టీసీ అదనపు సర్వీసులు
విజయనగరం అర్బన్: సింహాచలంలో ఈ నెల 30వ తేదీన జరిగే వరాహలక్ష్మీ స్వామి చందనోత్సవం సందర్శన కోసం ప్రత్యేక బస్సు సర్వీసులు నిర్వహిస్తున్నామని ఆర్టీసీ జిల్లా ప్రజా రవాణా అధికారి సీహెచ్ అప్పలనారాయణ తెలిపారు. ఆ రోజు ఉదయం 4 గంటల నుంచి రాత్రి ప్రయాణికుల రద్దీ ఉన్నంత వరకు దాదా పు 15 బస్సు సర్వీసులను అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా మరికొన్ని సర్వీసులను నిర్వహిస్తామని తెలిపారు. భక్తులు ఈ సర్వీసులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
గురుకులం ప్రవేశ పరీక్ష
ప్రశాంతం
నెల్లిమర్ల: పట్టణంలోని రెండు కేంద్రాల్లో ఆదివారం నిర్వహించిన మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఐదో తరగతిలో ప్రవేశాలకు సంబంధించి పరీక్ష నిర్వహించారు. బాలికల పాఠశాల కేంద్రంలో 201 మందికిగాను 180 మంది, మత్స్యకార బాలుర పాఠశాలలో 44 మందికి 38 మంది హాజరయ్యారు. ఆయా పాఠశాలల ప్రిన్సిపాళ్లు డాక్టర్ కేబీబీ రావు, కె.ఈశ్వరరావు పర్యవేక్షణలో పరీక్ష ప్రశాంతంగా ముగిసింది.
● తాగునీటి కష్టాలు
గుమ్మలక్ష్మీపురం మండలం రాయగడ జమ్ము పంచాయతీ చినరావికోన గ్రామ గిరిజనులు కొద్ది రోజులుగా తాగునీటి కష్టాలు పడుతున్నారు. గ్రామంలో 76 కుటుంబాలకు నీటి సౌకర్యం కల్పించేందుకు గెడ్డ చెలమకు అనుసంధానంగా ఏర్పాటు చేసిన గ్రావటీ వాటర్ స్కీం నుంచి కొన్నాళ్లుగా నీటి సరఫరా నిలిచిపోయింది. వేసవి ఎండల ధాటికి గెడ్డ చలమలోని నీరు ఇంకిపోవడంతో వాటర్ స్కీం నుంచి నీరు ఆగిపోయింది. దీంతో గ్రామానికి దిగువన ఉన్న పాములగీసాడ సమీపంలోని గెడ్డ చెలమ వద్దకు కొండ దిగి నీటిని సేకరించి మళ్లీ కొండపైకి వెళ్తారు. గిరిజనులు తాగునీటి కష్టాలు ఇటు పాలకులకుగాని, అధికారులకుగాని పట్టడం లేదు. – గుమ్మలక్ష్మీపురం
తక్షణమే డబ్బు చెల్లించాలి
2023, 2024 సంవత్సరాల్లో ఇల్లు నిర్మించుకు న్న వారినీ కూటమి ప్రభుత్వం వదిలి పెట్టడం లేదు. అప్పట్లో వారు పంచాయతీ కార్యాలయం నుంచి నిబంధనలు ప్రకారం అనుమతులు పొందినప్పటికీ 14 శాతం ఫీజు చెల్లించాలంటూ 13 మంది పేర్లును మేజర్ పంచాయతీ కార్యాలయం నోటీ సు బోర్డులో పెట్టారు. అప్పట్లో చెల్లించిన ఫీజు చాలదని, కచ్చితంగా 14 శాతం చెల్లించాల్సిందేనని, 13 మంది కలిపి రూ. 11,56,455లు చెల్లించా లని అధికారులు స్పష్టం చేశారు.
మేజర్ పంచాయతీ కార్యాలయం
చీపురుపల్లి:
సొంతింటి భాగ్యం పేదలకే కాదు.. సొంత స్థలం ఉన్నవారికీ ఇక భారమే. రూ.లక్షల ఫీజు చెల్లించనిదే మేజర్ పంచాయతీలో ఇంటిప్లాన్ అనుమతులు మంజూరు కావడం లేదు. సామాన్యుల సంగతి పక్కన పెడితే ఆ ఫీజులను చూసి ఉద్యోగు లు సైతం బెంబేలెత్తిపోతున్నారు. ఒకేసారి మార్కె ట్ విలువకు 14 శాతం ఫీజు చెల్లించాలన్న కూటమి ప్రభుత్వ నిబంధనలను చూసి చిర్రెత్తిపోతున్నారు. సంపద సృష్టి అంటూ సీఎం చంద్రబాబు ప్రజలనెత్తిన భారం వేస్తున్నారని విమర్శిస్తున్నారు. 2016లో అప్పటి టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే జీవో ఎంఎస్ నంబర్ 12ను విడుదల చేశారు. తరువాత కాలంలో ఆ జీవో అమలు కాలేదు. తాజాగా మళ్లీ అధికా రంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆ జీవోను అమలు చేయాలని, ప్రజల నుంచి ముక్కుపిండి 14 శాతం వసూలు చేయాలని ఆదేశాలు ఇవ్వడంతో ఇల్లు నిర్మించుకునే వారికి అదనపు భారం తప్పడం లేదు.
ఇదెక్కడి అన్యాయం..
ఇల్లు నిర్మించుకునే వారు ఆ ఇంటి స్థలానికి సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఉన్న మార్కెట్ విలువపై 14 శాతం ఫీజు చెల్లించాలన్న ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఏకంగా రూ.లక్షల్లో చెల్లించుకోవాల్సి వస్తోందని నిర్మాణదారులు వాపోతున్నారు. చీపురుపల్లిలోని ఓ ప్రాంతంలో సెంటు స్థలం మార్కెట్ విలువ రూ.6 లక్షలు ఉంటే 200 గజాలు స్థలం కలిగిన వ్యక్తి ఇంటిని నిర్మించుకునేందుకు బిల్డింగ్ అను మతులు కోసం వెళ్తే దాదాపు రూ.లక్షా25 వేలు ఫీజు చెల్లించుకోవాల్సి వస్తోందని ఓ నిర్మాణదారు వాపోయారు. గతంలో బిల్లింగ్ ప్లాన్ అనుమతి ఫీజుల కోసం రూ.10 వేలు లోపు ఖర్చేయ్యేదని, ప్రస్తుత ప్రభుత్వంలో మాత్రం రూ.లక్షల్లో ఖర్చు చే యాల్సి వస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
న్యూస్‌రీల్
జిల్లాకు కొత్తగా 1,521 పింఛన్లు మంజూరు
పార్వతీపురం టౌన్: జిల్లాలో కొత్తగా 1,521 మంది వితంతువులకు జీవిత భాగస్వామి పింఛను మంజూరైనట్టు కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ పేర్కొన్నారు. 2023 డిసెంబర్ 1వ తేదీ నుంచి 2024 అక్టోబర్ 31వ తేదీ మధ్య కాలంలో వితంతువులైన వారికి జీవిత భాగస్వామి పింఛన్లను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఈ మేరకు ప్రభుత్వం జీఓను విడుదల చేసిందని ఆదివారం నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో జిల్లా అధికారులకు తెలిపారు. మంజూరైన కొత్త పింఛన్లను రాష్ట్ర మంత్రులు, ప్రజా ప్రతినిధుల చేతుల మీదుగా మే 1వ తేదీ ఉదయం పంపిణీ చేసేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పేదల సేవలో భాగంగా జిల్లాలో 1,39,752 మందికి రూ.59.72 కోట్లు ఎన్‌టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పారు. వీటికి అదనంగా 1,521 మంది వితంతువులకు జీవిత భాగస్వామి పింఛన్లు పంపిణీ చేయాల్సి ఉందని కలెక్టర్ స్పష్టం చేశారు. కావున మొత్తం పింఛన్లకు సరిపడా నిధులను ముందుగానే సిద్ధం చేసుకొని మే 1వ తేదీ ఉదయం 10గంటల్లోగా శత శాతం పింఛన్లు పంపిణీ అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
మండలాల వారీగా మంజూరైన కొత్త పింఛన్లు
బలిజిపేట మండలంలో 69 మందికి, భామినిలో 86, గరుగుబిల్లిలో 77, గుమ్మక్ష్మీపురం 63, కొమరాడలో 66, జియ్యమ్మవలసలో 122, కురుపాంలో 51, మక్కువలో 131, పాచిపెంటలో 88, పాలకొండలో 77, పాలకొండ(అర్బన్)లో 47, పార్వతీపురం 126, పార్వతీపురం (అర్బన్)లో 60, సాలూరులో 75, సాలూరు (అర్బన్)లో 70, సీతంపేటలో 69, సీతానగరంలో 117, వీరఘట్టంలో 127 వెరసి మొత్తం 1,521 కొత్త పింఛన్లు మంజూరైనట్టు కలెక్టర్ వివరించారు. మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.
చెల్లించాల్సిందే..
బిల్డింగ్ ప్లాన్ అనుమతులు కోసం మార్కెట్ విలువపై 14 శాతం ఫీజు చెల్లించాల్సిందే. పంచాయతీల అభివృద్ధికి ఆదాయం అవసరం. 2023, 2024 సంవత్సరాల్లో ఇల్లు నిర్మించుకున్న 13 మందికి మార్కెట్ విలువపై 14 శాతం ఫీజు చెల్లించాలని ఆడిట్ విభాగం నుంచి నోటీసులు అందాయి. పంచాయతీ కార్యాలయం వద్ద వివరాలు ఉంచాం. 13 మంది కలిపి రూ.11,56,456 లక్షలు చెల్లించాల్సి ఉంది.
– ఝాన్సీ, మేజర్ పంచాయతీ అధికారి, చీపురుపల్లి

విజయనగరం

విజయనగరం