రైతు సంక్షేమానికి ప్రభుత్వం కృషి
వనపర్తి రూరల్: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు, ప్రజా సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తోందని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. గురువారం మండలంలోని పెద్దగూడెంలో వనపర్తి వ్యవసాయ మార్కెట్‌యార్డు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత పశువైద్య శిబిరాన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్, జిల్లా పశువైద్య అధికారి వెంకటేశ్వర్‌రెడ్డితో ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామాల్లో పశుసంతతి పెంచుకోవడానికి రైతులకు అవగాహన కల్పిస్తూ ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. శిబిరంలో 10 ఆవులు, 33 గేదెలు, 75 గొర్రెలకు చికిత్స అందించి మందులు పంపిణీ చేశామని పశు వైద్యాధికారి డా. రాజేష్ కన్నా తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ డైరెక్టర్ శారదమ్మ, కార్యదర్శి సరోజ, వైద్యాధికారులు ఆంజనేయులు, వెంకటేష్, జేవీఓ హరీశ్, మక్సూద్‌అలీ, వీఏ చక్రవర్తి, సత్యనారాయణ, బాలనాగి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment