సైబర్ నేరస్తులతో జాగ్రత్తగా ఉండాలి
వనపర్తి: సైబర్ నేరగాళ్లు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేస్తూ వ్యక్తిగత సమాచారంతో నేరాలకు పాల్పడుతున్నారని.. వారితో జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ రావుల గిరిధర్ సూచించారు. గురువారం జిల్లాకేంద్రంలోని బ్రహ్మంగారి ఆలయంలో హ్యాండ్ క్రాఫ్ట్ హైదరాబాద్, వనపర్తి జిల్లా స్వర్ణకారుల సంఘం సంయుక్తంగా స్వర్ణకారులకు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించగా ఎస్పీ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. స్వర్ణకారులు సైబర్ నేరాల బారిన పడకుండా ఆన్‌లైన్ చెల్లింపులు, సోషల్ మీడియా, ఫేస్‌బుక్, ఫోన్ కాల్స్, వాట్సాప్ లింకులతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వ్యక్తిగత సమాచారం చోరీ చేయడం, నష్టాలు కలిగించడంవంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్, మాజీ కౌన్సిలర్ బ్రహ్మచారి, వనిత, జ్యోతి, ఏకే ఖమర్ రహమాన్, స్వర్ణకారుల సంఘాల ప్రతినిధులు, స్వర్ణకారులు తదితరులు పాల్గొన్నారు.
ఎస్పీ రావుల గిరిధర్
Comments
Please login to add a commentAdd a comment