ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం
పాన్‌గల్: కొల్లాపూర్ నియోజకవర్గాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే మోడల్‌గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం మండలంలోని కదిరెపాడు, శాగాపూర్, మాధవరావుపల్లి, గోప్లాపూర్, బండపల్లి, జమ్మాపూర్, కేతేపల్లి, బుసిరెడ్డిపల్లి, మాందాపూర్, చింతకుంట, మల్లాయిపల్లిలో సుడిగాలి పర్యటన చేసి ఆయా గ్రామాల్లోని ఎస్సీ కాలనీల్లో ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులతో చేపట్టే సీసీ రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణాలకు భూమిపూజ చేసి మాట్లాడారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు మండలానికి రూ.3.60 కోట్లు మంజూరయ్యాయని.. గ్రామాల్లోని ఎస్సీకాలనీలలో చేపట్టే అభివృద్ధి పనులతో రూపురేఖలు మారుతాయని, పనులు నాణ్యతగా నిబంధనల మేరకు చేపట్టాలని సూచించారు. ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా.. ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోందని వివరించారు. సాగునీటితో కాల్వలతో గ్రామాల్లో వలసలు తగ్గినట్లు పేర్కొన్నారు. అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని.. అనర్హులుంటే తొలగిస్తామని తెలిపారు.
ప్రభుత్వ బడుల్లోనే చదివించాలి..
ప్రభుత్వ పాఠశాలల్లో అన్నిరకాల వసతులు, శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఉండటంతో నాణ్యమైన విద్య అందుతుందని.. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు బడుల్లో చేర్పించి డబ్బులు వృథా చేసుకోవద్దని మంత్రి సూచించారు. చదువుతోనే సమాజంలో గుర్తింపు, గౌరవం లభిస్తుందని.. ప్రత్యేక దృష్టి సారించాలని, మత్తు పదార్థాలు, చెడు అలవాట్లకు దూరంగా ఉండేలా పిల్లలపై నిఘా ఉంచాలన్నారు.
మాందాపూర్ అభివృద్ధికి రూ.3.95 కోట్లు..
మాందాపూర్‌లో పలు అభివృద్ధి పనులకు రూ.3.95 కోట్లు కేటాయించారు. గ్రామం నుంచి కంబాళాపూర్‌కు బీటీ రహదారి నిర్మాణానికి రూ.3.50 కోట్లు, గ్రామంలో వేసవిలో నీటిఎద్దడి నివారణ కోసం ప్రత్యేక పైపులైన్ నిర్మాణానికి రూ.15.5 లక్షలు, అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ, సీసీ రహదారుల నిర్మాణాలకు రూ. 30 లక్షలు మంజూరైనట్లు మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవర్దన్‌సాగర్, విండో డైరెక్టర్ ఉస్మాన్, మండల నాయకులు రవికుమార్, వెంకటేష్‌నాయుడు, మధుసూదన్‌రెడ్డి, రాముయాదవ్, పుల్లారావు, భాస్కర్‌యాదవ్, జయరాములుసాగర్, నరేందర్‌గౌడ్, దశరథం, వివిధ గ్రామాల పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
చదువుతోనే
సమాజంలో గుర్తింపు
రాష్ట్ర ఎకై ్సజ్,
పర్యాటకశాఖ మంత్రి
జూపల్లి కృష్ణారావు
Comments
Please login to add a commentAdd a comment