వైభవంగా వెంకన్న రథోత్సవం
ఖిల్లాఘనపురం: గట్టుకాడిపల్లి (అంజనగిరి) లక్ష్మీ వెంకటేశ్వరస్వామి రథోత్సవం బుధవారం రాత్రి కనులపండువగా సాగింది. ఆలయంలో వేదపండితులు ఉదయం నుంచి స్వామివారికి అభిషేకం, అర్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాత్రి అందంగా ముస్తాబు చేసిన లక్ష్మి అలవేలుమంగ సమేత వేంకటేశ్వరస్వామి ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం 11.30 ప్రాంతంలో రంగుంగుల విద్యుద్దీపాలు, పూలతో అలంకరించిన రథంపైకి మేళతాళాలు, భాజాభజంత్రీలు, భక్తుల గోవింద నామస్మరణల నడుమ చేర్చారు. రథానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులు గోవింద నామస్మరణతో రథాన్ని తేరు గడ్డ వరకు లాగారు. అక్కడ అర్చకులు పూజలు నిర్వహించి తిరిగి తెల్లవారుజామున 2.30 వరకు ఆలయానికి చేర్చారు. ఆనవాయితీగా ఖిల్లాఘనపురం, మానాజీపేట గ్రామస్తులు ఒక్కో తాడును పోటీపడి లాగారు. గురువారం ఉదయం ఆలయంలో మహా పూర్ణాహుతి, అశ్వవాహన, శేషవాహన సేవలు, తదితర పూజాకార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో తినుబండారాలు, ఆటసామగ్రి తదితర దుకాణాలు వెలిశాయి. గ్రామపెద్దలు, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు తాగునీటి సౌకర్యం కల్పించారు.
రథోత్సవంలో పాల్గొన్న భక్తులు
భారీగా తరలివచ్చిన భక్తులు
గోవింద నామంతో మార్మోగిన
గట్టుకాడిపల్లి
వైభవంగా వెంకన్న రథోత్సవం
Comments
Please login to add a commentAdd a comment