
బీసీ గురుకులంలో కలెక్టర్ బస
వనపర్తి: స్థానిక మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల పాఠశాలలో శుక్రవారం రాత్రి కలెక్టర్ ఆదర్శ్ సురభి బస చేశారు. నిత్యావసర సరుకుల నాణ్యతను పరిశీలించి విద్యార్థులకు కొన్ని ప్రశ్నలు వేసి సామర్థ్యాలను పరిశీలించారు. గణితాన్ని బోధించారు. పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఇన్నాళ్లు తయారు చేసుకున్న రాత పుస్తకాలను తనిఖీ చేశారు. ఉన్నత చదువులతోనే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని విద్యార్థులకు వివరించారు. విద్యార్థుల సామర్థ్యాలు, వారికి అందిస్తున్న ఆహార నాణ్యత, వసతులను పరిశీలించేందుకు పాఠశాలకు వచ్చినట్లు కలెక్టర్ వివరించారు.
పుల్వామా అమరులకు విశ్రాంత సైనికుల నివాళి
వనపర్తి విద్యావిభాగం: కశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో అమరులైన సైనికులకు శుక్రవారం రాత్రి జిల్లాకేంద్రంలో తెలంగాణ మాజీ కేంద్ర సాయిధ పోలీసు బలగాల సిబ్బంది సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నివాళులర్పించారు. అమరుల చిత్రపటాల బ్యానర్లను ప్రదర్శిస్తూ రాజీవ్‌చౌక్ వరకు ర్యాలీ, అక్కడే కొవ్వొత్తులు ప్రదర్శించి నివాళులర్పించారు. దేశ రక్షణలో అమరులైన సైనికుల త్యాగాలు వెలకట్టలేనివని కొనియాడారు. విశ్రాంత సైనికులు చీర్ల రాముడు, దేవేందర్, ఉమామహేశ్వర్, ఆంజనేయులు, నాగరాజు, రాములు, సత్యనారాయణ పాల్గొన్నారు.
త్రిఫ్ట్ ఫండ్‌కు
దరఖాస్తుల ఆహ్వానం
అమరచింత: ప్రభుత్వం ప్రవేశపెట్టిన త్రిఫ్ట్‌ఫండ్ పథకానికి అర్హులైన చేనేత కార్మికులు దరఖాస్తు చేసుకోవాలని చేనేత జౌళీశాఖ ఏడీ గోవిందయ్య శనివారం కోరారు. జిల్లాలోని అమరచింత, కొత్తకోట, తిప్పుడంపల్లి, వెల్టూరు, ఖిల్లాఘనపురం తదితర గ్రామాల్లో చేనేతపై ఆధారపడిన కార్మికులు మగ్గానికి ఇద్దరు చొప్పున జియోట్యాగింగ్ నంబర్ ఆధారంగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. లబ్ధిదారులు ఆర్‌డీ 1 బ్యాంక్ ఖాతాలో తమ నెలసరి వేతనంలో 8 శాతం జమచేయాలని, అలాంటి వారు అన్ని ధ్రువపత్రాలను జౌళిశాఖ కార్యాలయంలో అందించాలని కోరారు.
భక్తిశ్రద్ధలతో
రాజవళి గంధోత్సవం
అమరచింత: పట్టణంలోని సయ్యద్‌షా రాజవళి ఉర్సులో ప్రధాన ఘట్టమైన గంధోత్సవం శుక్రవారం రాత్రి భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. శ్రీకృష్ణనగర్ దర్గా ఇంటి నుంచి గంధాన్ని ఉరేగింపుగా దర్గా షరీఫ్‌కు తీసుకొచ్చారు. వెండితో తయారుచేసిన రాజవళి దర్గా నమూనాను టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి కేశం నాగరాజుగౌడ్ తలపై ఉంచుకొని దర్గా షరీఫ్‌కు తీసుకొచ్చారు. శనివారం తాజే చిరాక్ సందర్భంగా భక్తులు మలీజాలను నైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. కార్యక్రమంలో మసీదు కమిటీ అధ్యక్షుడు అయ్యూబ్‌ఖాన్, దర్గా కమిటీ సభ్యులు ఖాసీం, ఖాజాహుస్సేన్, ఇంతియాజ్, ఖదీర్, అల్తాఫ్ తదితరులు పాల్గొన్నారు.
ఆశాజనకంగా వేరుశనగ ధరలు
జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌యార్డులో వేరుశనగ ధరలు ఆశాజనకంగా లభిస్తున్నాయి. వారం రోజులుగా ధరలు స్వల్పంగా పెరుగుతున్నాయి. శుక్రవారం వివిధ ప్రాంతాల నుంచి 4,402 క్వింటాళ్ల వేరుశనగ విక్రయానికి వచ్చింది. క్వింటాల్ గరిష్టంగా రూ.6,819, కనిష్టంగా రూ.4,009 ధరలు పలికాయి. కందులు క్వింటాల్ గరిష్టంగా రూ.6,969, కనిష్టంగా రూ.4,300, మొక్కజొన్న గరిష్టంగా రూ.2,370, కనిష్టంగా రూ.2,059, పెబ్బర్లు గరిష్టంగా రూ.6,750, కనిష్టంగా రూ.6,100, మినుములు రూ.7,821, ఆర్‌ఎన్‌ఆర్ గరిష్టంగా రూ.2,479, కనిష్టంగా రూ.2,150 ధరలు లభించాయి. దేవరకద్ర మార్కెట్ యార్డులో కందులు క్వింటాల్‌కు గరిష్టంగా రూ.6,869, కనిష్టంగా రూ.6,689గా ధరలు పలికాయి.

బీసీ గురుకులంలో కలెక్టర్ బస

బీసీ గురుకులంలో కలెక్టర్ బస
Comments
Please login to add a commentAdd a comment