గన్ని బ్యాగుల దగ్ధం కేసులో కొందరు స్థానిక నేతల హస్తం ఉందనే కోణంలో మొదట్లో పోలీసుల విచారణ సాగింది. అంతలోనే చోటు చేసుకున్న కొన్ని రాజకీయ పార్టీ ఫిరాయింపులతో విచారణ మలుపు తిరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. విచారణ తుది దశకు చేరుకునే సమయంలోనే.. ఈ వ్యవహారంతో సంబంధం ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలు పార్టీ మారినట్లు వదంతులు వినిపిస్తున్నాయి. వారంతా అధికార పార్టీలో చేరడంతో విచారణ మలుపు తిరిగినట్లు తెలుస్తోంది. పోలీసు, రెవెన్యూ అధికారులు ఇచ్చిన విచారణ నివేదికలో ఎండ తీవ్రతకు గోదాంలో మంటలు చెలరేగి గన్నీ బ్యాగులకు నిప్పంటుకున్నట్లు పేర్కొన్నట్లు ప్రచారం సాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment