
ప్రజావాణి అర్జీలకు సత్వర పరిష్కారం
వనపర్తి: ప్రజావాణి అర్జీలను సత్వరం పరిష్కరించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణికి రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, జెడ్పీ సీఈఓ యాదయ్యతో కలిసి హాజరై ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యలకు పరిష్కారం చూపే బాధ్యత అధికారులపై ఉందన్నారు. ప్రజావాణికి 53 దరఖాస్తులు వచ్చాయని.. పరిశీలించి సత్వర పరిష్కారం చూపాలంటూ ఆయా శాఖల జిల్లా అధికారులకు రెఫర్ చేశారు. సీఎం, జిల్లా మంత్రి ప్రజావాణి నుంచి వచ్చిన, పెండింగ్‌లో ఉన్న అర్జీలను సైతం వారంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
వసతిగృహాలను పర్యవేక్షించాలి..
మండల ప్రత్యేక అధికారులు ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో పరిస్థితులను పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. ప్రజావాణి అనంతరం సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. విద్యార్థుల సమస్యలు, మౌలిక వసతులకు సంబంధించిన నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఎండాకాలం సమీపిస్తున్నందున ఉపాధి కూలీలకు పని ప్రదేశాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment