28న సైన్స్ దినోత్సవాన్ని నిర్వహించాలి : డీఈఓ
విద్యారణ్యపురి: జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ఈనెల 28న జాతీయ సైన్స్ దినోత్సవాన్ని నిర్వహించాలని హనుమకొండ డీఈఓ డి.వాసంతి హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులను ఆదేశించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన, క్వి జ్, సైన్స్ సెమినార్లు, సైన్స్ పుస్తక ప్రదర్శన, సై న్స్ పరికరారాలు, సైన్స్ ప్రయోగాలు, సైన్స్ అ భ్యసన సామగ్రి, ప్రాజెక్టుల ప్రదర్శన నిర్వహించాలని పేర్కొన్నారు. శాస్త్రవేత్తలతో ఉపన్యాసాలు, విజ్ఞానమేళాలు ఏర్పాటు చేయాలని కోరారు. వివరాల కోసం జిల్లా సైన్స్ అధికారి ఎస్.శ్రీనివాస్‌స్వామి 9490112848 నంబర్‌లో సంప్రదించాలని ఆమె సూచించారు.
నూతన ఎస్జీటీలకు శిక్షణ
విద్యారణ్యపురి: డీఎస్సీ–2024లో ఎస్జీటీలుగా నియమితులైన వారికి ఈనెల 28 నుంచి మార్చి 3 వరకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఉపాధ్యాయులకు అభ్యసన సామర్థ్యాల సాధన, లెర్నింగ్ అవుట్‌కం, లెసెన్‌ప్లాన్, వర్క్‌షీట్స్ తదితర అంశాలపై శిక్షణ ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. హనుమకొండ జిల్లాలో 75 మంది టీచర్లకు హనుమకొండ లష్కర్‌బజార్‌లోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఉదయం 9 నుంచి సాయంత్రం 4–30 గంటల వరకు శిక్షణ కొనసాగనుందని జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్ ఎ.శ్రీనివాస్ తెలిపారు. నలుగురు రిసోర్స్‌పర్సన్లు తెలుగు, ఇంగ్లిష్, మ్యాథ్స్, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్‌పై కూడా శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా వరంగల్ జిల్లాలో 163 మంది ఎస్జీటీలకు శుంభునిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 12 మంది రిసోర్స్‌పర్సన్లు శిక్షణ ఇవ్వనున్నారు.
4 నుంచి కేయూ ఎంసీఏ
మొదటి సెమిస్టర్ పరీక్షలు
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఎంసీఏ మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్ పరీక్షలు మార్చి 4 నుంచి నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య కె.రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి ఆసింఇక్బాల్ మంగళవారం తెలిపా రు. మార్చి 4, 6, 11, 13, 17 తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని వారు పేర్కొన్నారు.
కొనసాగుతున్న
నాటక పోటీలు
హన్మకొండ కల్చరల్: హనుమకొండ బాలసముద్రంలోని కాళోజీ కళాక్షేత్రంలో తెలుగు భాషా ఆహ్వాన నాటక పోటీలు కొనసాగుతున్నాయి. వరంగల్ సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ అధ్యక్షుడు గన్నమరాజు గిరిజామనోహరబాబు ఆధ్వర్యంలో మూడో రోజు మంగళవారం చీరాలకు చెందిన విష్ణు బొట్ల, కందాళం ఫౌండేషన్ అధ్యక్షుడు అప్పాజ్యోసుల సత్యనారాయణ జ్యోతి ప్రజ్వలన చేసి నాటక ప్రదర్శన ప్రారంభించారు. ఇందులో భాగంగా ‘సారీ రాంగ్ నంబర్’, ‘వీడేం మగాడండి బాబు’ నాటక ప్రదర్శనలు అలరించాయి. విశిష్ట అతిథులుగా మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు, మీరా సంగీత మండలి బాధ్యుడు వెంకటేశ్వరరావు హాజరయ్యారు.
ముగిసిన మహారుద్రయాగం
హన్మకొండ కల్చరల్: మహాశివరాత్రి సందర్భంగా భద్రకాళి దేవాలయంలో మహారుద్రయాగం, గ్రహముఖం, శ్రీరుద్రపునఃశ్చరణ, శివపంచాక్షరీ, జపహోమార్చన, అభిషేకాలు మంగళవారం ముగిశాయి. జాగరణ చేసే భక్తుల కోసం బుధవారం రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు ఆలయ ఈఓ శేషుభారతి తెలిపారు.
28న సైన్స్ దినోత్సవాన్ని నిర్వహించాలి : డీఈఓ
Comments
Please login to add a commentAdd a comment