వరంగల్: బొల్లికుంటలోని వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాలలో ఈనెల 11న నిర్వహించనున్న జిల్లాస్థాయి యువజనోత్సవాల్లో యువకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని యువ కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ చింతల అన్వేష్ ఒక ప్రకటనలో తెలిపారు. యంగ్ రైటర్స్, యంగ్ ఆర్టిస్ట్, ఫొటోగ్రఫీ, ఉపన్యాసం, సాంస్కృతిక జానపద నృత్యం (గ్రూప్), సైన్‌న్స్ ఎగ్జిబిషన్ (గ్రూప్, వ్యక్తిగత) అంశాల్లో పోటీలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పంచ ప్రాణ్ అంశంపై పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందని చెప్పారు. గ్రూప్, ఫోక్‌డ్యాన్స్, ఫొటోగ్రఫీ కాంపిటీషన్‌లో పంచ్ ప్రాణ్ అంశం వర్తించదని వివరించారు. ఉత్సాహవంతులైన ఫొటోగ్రాఫర్లు తమ సెల్‌ఫోన్లు, తెచ్చుకున్న కెమెరాలతో పోటీ ప్రదేశంలో ఇచ్చిన థీమ్స్‌ను ఫొటోలు తీసి చూపిస్తారని పేర్కొన్నారు.
ప్రతిభ కనబరిచిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ నగదు బహుమతితోపాటు ప్రశంసపత్రాలు అందజేస్తామని వెల్లడించారు. జిల్లాలోని యువజన సంఘాలు, కళాశాల విద్యార్థులు తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, పూర్తి వివరాల కోసం 76758 24707/95733 93831 నంబర్లలో సంప్రదించాలని అన్వేష్ సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment