చోరీ కేసులో ఇద్దరి అరెస్ట్
ఆత్మకూరు: మండలంలోని గుడెప్పాడ్ గ్రామంలో గల సీతారామాంజనేయ స్వామి ఆలయంలో సోమవారం దొంగలు హుండీ పగులగొట్టి నగదు ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే. కాగా.. పోలీసులు దర్యాప్తు చేసి నిందితులిద్దరినీ మంగళవారం అరెస్ట్ చేశారు. హసన్‌పర్తి మండలం ముచ్చెర్ల గ్రామానికి చెందిన ఖాజా పాషా, మహమ్మద్ అంజద్ ఇద్దరు కలిసి (ఏపీ 36 ఏకే 2352) మోటారు సైకిల్‌పై వచ్చి హుండీని పగులగొట్టి అందులోని రూ.6 వేలు దొంగలించినట్లు సమాచారం మేరకు ముచ్చర్ల గ్రామానికి వెళ్లి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి బైక్, హుండీ పగులగొట్టడానికి ఉపయోగించిన పనిముట్లు, చోరీ చేసిన నగదు రికవరీ చేశారు. నిందితులను అరెస్ట్ చేసినట్లు సీఐ సంతోశ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment