మామిడి చెట్ల నరికివేత
కమలాపూర్: మండల కేంద్రానికి చెందిన రైతు బండి సారయ్య పొలం గట్ల వెంట నాటుకున్న సుమారు 31 మామిడి మొక్కలను గుర్తు తెలయిన వ్యక్తులు నరికేశారు. బాధిత రైతు బండి సారయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మూడేళ్ల క్రితం ఒక్కో చెట్టుకు రూ.500 వెచ్చించి సుమారు 55 మామిడి మొక్కలు కొన్నాడు. కమలాపూర్ సమ్మక్క గుట్ట సమీపంలో తనకున్న వ్యవసాయ పొలం గట్ల వెంట వాటిని నాటాడు. మూడేళ్లుగా వాటికి నీరుపడుతూ పెంచుకుంటుండగా.. మరో రెండేళ్లయితే అవి కాతకొచ్చే దశకు చేరుకుంటాయి. ఈక్రమంలో సుమారు 31 మామిడి మొక్కలను ఆదివారం రాత్రి గుర్తు తెలియని దుండగులు మొదళ్ల వద్ద నరికేశారు. ప్రాణప్రదంగా పెంచుకుంటున్న మామిడి చెట్ల నరికివేతతో తనకు సుమారు రూ.3 లక్షల వరకు నష్టం వాటిల్లిందని, చెట్లను నరికేసిన దుండగుల్ని గుర్తించి వారిని కఠినంగా శిక్షించి తనకు న్యాయం చేయాలని బాధిత రైతు సారయ్య వేడుకుంటున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment