
ప్రభుత్వ వైఫల్యంతోనే జాప్యం
నగరాభివృద్ధికి కేంద్రం మంజూరు చేసిన నిధులను సద్వినియోగం చేసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. స్మార్ట్‌సిటీ నిధులు సగానికి పైగా వెనక్కి వెళ్లే పరిస్థితులు వచ్చాయంటే పాలకుల అవగాహన రాహిత్యం, అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రణాళికలేమి కారణంగా అనేక పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు అధికారులను సమన్వయం చేసుకుంటూ స్మార్ట్‌సిటీ పనులను వేగవంతం చేయాలి. అప్పుడే మరిన్ని నిధులు నగరానికి మంజూరయ్యే అవకాశం ఉంటుంది.
– డాక్టర్ కంజర్ల మనోజ్, పెద్దమ్మగడ్డ, హనుమకొండ