
మామిడిలో జాగ్రత్తలు తీసుకోవాలి
దుగ్గొండి: మామిడి తోటల్లో తామర పురుగు, కాయతొలుచు పురుగు, పిందె రాలడం చాలా తీవ్రంగా ఉందని జిల్లా ఉద్యానశాఖ అధికారి సంగీతలక్ష్మి అన్నారు. రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు. మండలంలోని ముద్దునూరు, చలపర్తి గ్రామాల్లో ఆదివారం ఆమె మామిడి తోటలను పరిశీలించి మాట్లాడారు. తామర పురుగుల నివారణకు పిఫ్రోనిల్ 40 గ్రాములు, 400 గ్రాముల సాఫ్ మందు, 400 మిల్లీలీటర్ల కార్బోసల్ఫాన్ మందులను 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలన్నారు. 10 సంవత్సరాలు దాటిన ఒక్కో చెట్టుకు 500 గ్రాముల యూరియా, కిలో పొటాష్‌ను వేసి నీరు పెడితే పిందె రాలే శాతం తగ్గుతుందని ఆమె తెలిపారు.
హత్య చేసిన ఇద్దరిపై
కేసు నమోదు
నల్లబెల్లి: వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడనే నెపంతో మండలంలోని మూడుచెక్కలపల్లి గ్రామానికి చెందిన బానోత్ కొమ్మాలును హత్య చేసిన ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై గోవర్ధన్ ఆదివారం తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. హత్యకు గురైన బానోత్ కొ మ్మాలు కొంతకాలంగా అదే గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ మేరకు పలుమార్లు పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ చేసి మందలించి కొమ్మాలుకు జరిమానా విధించారు. అయినా వివాహేతర సంబంధం కొనసాగిస్తుండడంతో సదరు మహిళ తన భర్త జంపయ్యతో కలిసి కొమ్మాలును హత్య చేసింది. మృతుడి భార్య కవిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
మల్లన్నకు ప్రత్యేక పూజలు
ఐనవోలు: సూర్యుడు మీనరాశి నుంచి మేష రాశిలోకి ప్రవేశించిన సందర్భంగా ఆదివారం ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయంలో ప్రత్యేక సంక్రమణ పూజలు నిర్వహించారు. ఉదయం ఆలయంలో నిత్య పూజలు నిర్వహించిన అనంతరం ఉప ప్రధాన అర్చకుడు పాతర్లపాటి రవీందర్, ముఖ్య అర్చకులు ఐనవోలు మధుకర్‌శర్మ, వేద పండితులు విక్రాంత్ వినాయక్ జోషి ఆధ్వర్యంలో స్వామి వారికి మహన్యాసపూర్వక రుద్రాభిషేకం, రుద్ర హోమం జరిపించారు. అలాగే గొల్లకేతమ్మ, బలిజ మేడలమ్మలతో మల్లికార్జునస్వామి కల్యాణం నిర్వహించారు. కాగా.. ఒగ్గు పూజా రులు పెద్దపట్నం వేసి, ఒగ్గు కథలు చెబుతూ.. మల్లన్న కల్యాణంతో పాటు ప్రత్యేక ఒగ్గు పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ అద్దంకి నాగేశ్వర్‌రావు, ఆలయ అర్చక సిబ్బంది పాల్గొన్నారు.
ప్రశాంతంగా ఎన్‌డీఏ పరీక్ష
కేయూ క్యాంపస్: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో ఆదివారం ఎన్‌డీఏ(నేషనల్ డిఫెన్స్ అకాడమీ) పరీక్షను నిర్వహించారు. ఈపరీక్ష కేంద్రాన్ని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య సందర్శించారు. పరీక్షలు నిర్వహిస్తున్న తీరును పరిశీలించారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని సంబంఽధిత అధి కారులకు సూచింంచారు. పరీక్షల నిర్వహణపై ఏర్పాట్ల గురించి కూడా అడిగి తెలుసుకున్నారు. ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ఆచార్య ఎస్.జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
జంక్ ఫుడ్‌కు
దూరంగా ఉండాలి
హన్మకొండ చౌరస్తా: సేంద్రియ పద్ధతిలో పండించిన వాటిని తినాలని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాశ్ అన్నారు. హనుమకొండ పబ్లిక్ గార్డెన్‌లోని నేరెళ్ల వేణుమాధవ్ కళాప్రాంగణంలో గ్రామ భారతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రకృతి గ్రామీణ ఉత్పత్తుల సంతను ఆదివారం బండా ప్రకాశ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత జంక్‌ఫుడ్‌కు అలవాటు పడి అనేక వ్యాధులు కొని తెచ్చుకుంటోందన్నారు. జంక్‌ఫుడ్, రసాయనాలతో కూడిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. తెలంగాణ గ్రామ భారతి అధ్యక్షురాలు సూర్యకళ మాట్లాడుతూ ప్రజల్లో మార్పు తీసుకురావాలన్న సదుద్దేశంతో ప్రతీ నెల ప్రకృతి సంత నిర్వహిస్తున్నట్లు తెలి పారు. కార్యక్రమంలో సామాజికవేత్త నిమ్మల శ్రీనివాస్, సంస్థ వరంగల్ జిల్లా బాధ్యుడు అజిత్‌రెడ్డి, తోట ఆనందం, అనిత, బయ్య సారయ్య తదితరులు పాల్గొన్నారు.

మామిడిలో జాగ్రత్తలు తీసుకోవాలి