
ఘన్‌పూర్‌కు కడియం చేసిందేమీ లేదు
వేలేరు: స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేసిందేమీ లేదని, బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ నిధులు కేటాయించి ఘన్‌పూర్‌ను అభివృద్ధి చేశారని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. బుధవారం మండలంలోని షోడాషపల్లి గ్రామంలో వేలేరు, ధర్మసాగర్, చిల్పూరు మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఘన్‌పూర్ నియోజకవర్గంలో 2004 నుంచి కడియం శ్రీహరి ఎమ్మెల్యేగా గెలవనేలేదని, ఎమ్మెల్యే కాకుండా అభివృద్ధి ఎలా చేశాడో చెప్పాలని ప్రశ్నించారు. అప్పటి టీడీపీ ప్రభుత్వ హయంలో చంద్రబాబు దేవాదులకు శంకుస్థాపన చేసి వదిలేస్తే పనులు వెంటనే చేపట్టాలని రాజయ్య పిండప్రదానం పెట్టి నిరసన తెలిపిన విషయం మర్చిపోయవా? అని ప్రశ్నించారు. ఆయనకు వయస్సు మళ్లడంతో మతిభ్రమించి మాట్లాడుతున్నారని విమర్శించారు. దేవునూరు గుట్టల్లో 21 ఎకరాల భూమిని కడియం శ్రీహరి తన బీనామీల పేరుతో పట్టా చేసుకున్నాడని ఆరోపించారు. అనంతరం వివిధ పార్టీల నుంచి సుమారు 200 మంది పల్లా సమక్షంలో బీఆర్‌ఎస్ కండువా కప్పుకున్నారు. కార్యక్రమంలో జనగామ గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఎడవెల్లి కృష్ణారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ గుండ్రెడ్డి రాజేశ్వర్‌రెడ్డి. ఆయా మండలాల ఇన్‌చార్జులు భూపతిరాజు, సోమిరెడ్డి, మనోజ్‌రెడ్డి, మాజీ ఎంపీపీ కవితా రెడ్డి, మాజీ జెడ్పీటీసీ కీర్తి వెంకటేశ్వర్లు, మాజీ వైస్ ఎంపీపీ సంపత్, మండల కో ఆర్డినేటర్ గోవింద సురేశ్, తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, స్టేషన్ ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే రాజయ్య