స్కూళ్లలో థర్డ్‌ పార్టీ సర్వే | - | Sakshi
Sakshi News home page

స్కూళ్లలో థర్డ్‌ పార్టీ సర్వే

Published Mon, Apr 21 2025 1:15 PM | Last Updated on Mon, Apr 21 2025 1:15 PM

స్కూళ

స్కూళ్లలో థర్డ్‌ పార్టీ సర్వే

విద్యారణ్యపురి: ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని అన్ని ప్రభుత్వ యాజమాన్యాల పాఠశాలల్లో సమగ్ర వివరాల సేకరణకు థర్డ్‌ ద్వారా పార్టీ సర్వే నిర్వహిస్తున్నారు. 2024–25 విద్యాసంవత్సరంలో డిస్ట్రిక్ట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌ (యూడైస్‌) ద్వారా ప్రతీ పాఠశాల నుంచి హెచ్‌ఎంల ద్వారా ఆన్‌లైన్‌లో పాఠశాలల్లోని అన్ని వివరాలను విద్యాశాఖ సేకరించింది. కాగా.. ప్రతీ పాఠశాలలోనూ విద్యార్థులు, ఉపాధ్యాయుల సంఖ్యతోపాటు పాఠశాలల్లో మౌలిక వసతులు ఎలా ఉన్నాయనే వివరాలను సర్వేలో పొందుపరుస్తున్నారు. ఈసర్వేలో.. తరగతి గదులు, టాయిలెట్స్‌, కిచెన్‌ షెడ్లు, తాగునీటి సదుపాయం, విద్యుత్‌ సౌకర్యం, కంప్యూటర్లు, డిజిటల్‌ తరగతులు, ఫర్నిచర్‌ సదుపాయాలతోపాటు పాఠ్యపుస్తకాల పంపిణీ, స్కూల్‌ యూనిఫాం పంపిణీ వంటి అంశాలను నమోదు చేస్తారు. 2024–25కు సంబంఽధించి ప్రతీ పాఠశాల హెచ్‌ఎంల ద్వారా ప్రొఫార్మాలో స్కూల్‌ రిపోర్టును ఆన్‌లైన్‌లో విద్యాశాఖ సేకరించింది. హెచ్‌ఎంలు ఇచ్చిన ఆయా సమగ్ర సమాచారం సక్రమంగానే ఉందా? లేదా అనేది ఫిజికల్‌గా పరిశీలనకు థర్డ్‌పార్టీ ద్వారా విద్యాశాఖ సర్వేను ఈనెల 15న ప్రారంభించగా. సోమవారం సర్వే ముగుస్తుంది.

ఒక్కో విద్యార్థికి 10 పాఠశాలలు..

ప్రతీ జిల్లాలో ఒక్కో విద్యార్థి పది పాఠశాలల్లో సర్వే చేయాలని అధికారులు నిర్ణయించారు. ఒక్కో విద్యార్థి రోజుకు రెండు స్కూళ్లలో మాత్రమే సర్వే చేయాల్సి ఉంటుంది. ఆపాఠశాల హెచ్‌ఎం ఇప్పటికే ఇచ్చిన యూడైస్‌ లో పేర్కొన్నవిధంగా పాఠశాలలకు సంబంధించిన సమగ్ర సమాచారం పొందుపర్చింది వాస్తవమేనా లేదా, పాఠశాలల్లో మౌలిక వసతులను పరిశీలిస్తారు.

సర్వే వివరాలివీ..

జిల్లా పేరు పాఠశాలల సర్వే చేస్తున్న

సంఖ్య విద్యార్థులు

హనుమకొండ 467 47

వరంగల్‌ 530 53

అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహణ

నిమగ్నమైన ప్రభుత్వ డైట్‌,

బీఈడీ కళాశాల విద్యార్థులు

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో

2,799 పాఠశాలలు..

నేటితో ముగియనున్న వివరాల సేకరణ

విద్యార్థులతో నిర్వహణ..

హనుమకొండ ప్రభుత్వ డైట్‌ కళాశాల, ప్రభుత్వ బీఈడీ కాలేజీ విద్యార్థులతో సర్వే నిర్వహిస్తున్నారు. ఆయా విద్యార్థులకు ఎలా సర్వే చేయాలనే దానిపై ఇటీవల శిక్షణ కూడా ఇచ్చారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 2,979 పాఠశాలల్లో ఈ సర్వే కోసం 299 మంది (డైట్‌, బీఈడీ కళాశాల) విద్యార్థులతో సర్వేను ఈనెల 15 నుంచి నిర్వహిస్తున్నారు. హనుమకొండ జిల్లాలో సర్వేను డీఈఓ డి.వాసంతి, డీఈఓ కార్యాలయం ప్లానింగ్‌ కోఆర్డినేటర్‌ బి.మహేశ్‌ఖ పర్యవేక్షిస్తున్నారు. వివిధ పాఠశాలల్లో వారు సేకరిస్తున్న సర్వేను పర్యవేక్షిస్తూ వారికి సూచనలిస్తున్నారు.

స్కూళ్లలో థర్డ్‌ పార్టీ సర్వే1
1/1

స్కూళ్లలో థర్డ్‌ పార్టీ సర్వే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement