● 498 (ఎ) గృహ హింస కేసు పెట్టిన ఏడాది తర్వాత కేసు తేలినా, తేలకపోయినా కోర్టు విడాకులు మంజూరు చేసి, రెండో వివాహానికి అనుమతి ఇవ్వాలి.
● 498 (ఎ) గృహ హింస తప్పుడు కేసు అని తేలితే భార్య, భార్య తల్లిదండ్రులకు మూడేళ్ల జైలు శిక్ష, భర్తలకు నష్టపరిహారం, పరువు మర్యాదలు ఇప్పించాలి.
● భార్యలు ఎన్ని రకాల కేసులు పెడితే అన్ని రకాల కేసులకు భర్తలు, భర్తల కుటుంబాలందరికీ కూడా కౌన్సెలింగ్‌లు ఇచ్చి సరైన న్యాయం జరిగేలా చూడాలి.
● భార్యలు ఎన్ని రకాల కేసులు పెడితే అన్ని రకాల కేసులకు హాజరు కావాలి. అలా రెండుసార్లు హాజరు కాని పక్షంలో ఆ కేసులను పూర్తిగా రద్దు చేయాలి
● ఎంసీ, డీవీసీ (డొమెస్టిక్ వయొలెన్స్)లను చట్టం నుంచి పూర్తిగా రద్దు చేసి పెండింగ్‌లో ఉన్న కేసులను రద్దు చేసి, జైలు శిక్షలు అనుభవిస్తున్న వారిని వెంటనే విడుదల చేయాలి
● పూర్వం ఈ కేసుల వల్ల నష్టపోయిన వారికి భార్యలతో ఆ నష్టపరిహారాన్ని ఇప్పించి ఒక ఏడాది భార్యలకు, భార్యల తల్లిదండ్రులకు జైలు శిక్ష మంజూరు చేయాలి.
● భర్తలు అవసరం లేదని వెళ్లిన భార్యలకు నష్టపరిహారం చెల్లించకూడదు.
● గృహ హింస కేసు పెట్టిన తర్వాత భార్యాభర్తలిద్దరి శాంపిల్స్ డీఎన్‌ఏ టెస్ట్‌లకు పంపాలి.
● భార్యలు కేసులు పెట్టిన తర్వాత ఒక వేళ పిల్లలు ఉంటే భార్యల వద్ద నాలుగు రోజులు, భర్తల వద్ద మూడు రోజులు ఉండేటట్లు అనుమతినివ్వాలి.
● భార్యలు పెట్టిన కేసుల వల్ల భర్తలకు ఉద్యోగాలు పోకుండా చూడాలి. భర్తలు, వారి తల్లిదండ్రులు కష్టపడి సంపాదించుకున్న ఆస్తిపాస్తులు భార్యా పిల్లలకు చెందకూడదు.
● పెళ్లి అయిన ఏడాది తర్వాత నుంచి భార్యలు పుట్టింటికి చూడటానికి వెళితే నెల రోజులలోపు భర్తల దగ్గరకు రావాలి. అలా రాని యెడల భర్తలకు విడాకులు మంజూరు చేయాలి.
● భర్తల దగ్గర నుంచి భార్యలు విడాకులు తీసుకున్న తర్వాత భార్యలు, పిల్లలు భర్తల ఇంటి పేర్లను ఎటువంటి వాటిలో ఉపయోగించకూడదు. అలా ఉపయోగించిన పక్షంలో కోర్టు శిక్ష విధించాలి.
● మహిళలకు ఎటువంటి చట్టాలు, పథకాలు ఇచ్చారో అలాంటి చట్టాలు, పథకాలు పురుషులకు కూడా ఇవ్వాలి.
Comments
Please login to add a commentAdd a comment