భార్యాబాధితుల సంఘం.. ఓ వర్గానికి ఊరట కోసం
తాడేపల్లిగూడెం: భార్యాభర్తలు.. అన్యోన్య దాంపత్యానికి ప్రతిరూపాలు.. ఒకరికి ఒకరై.. కష్టసుఖాల్లో తోడుంటూ.. జీవితాన్ని ఆనందమయం చేసుకోవాల్సిన దంపతులు అహం, అహంకారం, అవగాహనలేమితో నిండు జీవితాల్లో నిప్పులు పోసుకుంటున్నారు. చట్టాల్లో వెసులుబాటును ఆసరాగా తీసుకుని కోర్టులను ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో వరకట్న వేధింపుల నివారణ, గృహహింస చట్టాలు కొందరు మహిళలకు ఆయుధంగా మారాయి. ఇలా భార్యల వల్ల ఇబ్బందులు పడుతున్న కొందరు ఏర్పాటుచేసుకున్న సంఘమే భార్యాబాధితుల సంఘం. 2010లో తాడేపల్లిగూడెంలో పురుడు పోసుకున్న సంఘం దేశవ్యాప్తంగా శాఖలుగా విస్తరించింది. తాడేపల్లిగూడెం, నందిగామ, హైదరాబాద్, ఖమ్మంలో ముఖ్య శాఖలుగా చైతన్య వంతమైన కార్యక్రమాలను నిర్వహిస్తూ భార్యాబాధితులకు బాసటగా నిలుస్తోంది. దేశవ్యాప్తంగా రిజిస్టర్ అయిన ఈ సంఘంలో సుమారు 10 వేల మంది వరకు సభ్యులు ఉన్నారు. 25 మంది క్రియాశీలకంగా కోర్ కమిటీగా ఏర్పడి సంఘం తరఫున న్యాయం కోసం గళం విప్పుతున్నారు.
ఫిర్యాదుల స్వీకరణే.. కేసులు నమోదు కాలేదు
భార్యాబాధితుల సంఘం తరఫున బాధితులు రాష్ట్రవ్యాప్తంగా తమ గోడు వెళ్లబోసుకుంటూ ప్రజాప్రతినిధులకు, పోలీసులకు పలు ఫిర్యాదు అందించారు. అయితే ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం 498 (ఎ) సెక్షన్‌లో కల్పించిన స్టేషన్ బెయిల్ వెసులుబాటు మాత్రమే భార్యాబాధితుల సంఘానికి కాసింత ఊరట.
పెరుగుతున్న బాధితులు
మగాళ్లకూ రక్షణ కావాల్సిందే..
జాతీయస్థాయిలో ఉద్యమం
తెలుగు రాష్ట్రాల్లో శాఖల ఏర్పాటు
గూడెంలో ఆవిర్భవించిన సంఘం
భార్యాబాధితుల సంఘం.. ఓ వర్గానికి ఊరట కోసం
భార్యాబాధితుల సంఘం.. ఓ వర్గానికి ఊరట కోసం
Comments
Please login to add a commentAdd a comment