పీడీఎఫ్ అభ్యర్థిని గెలిపించండి
శివరాత్రి ఏర్పాట్లు
భీమవరం గునూడిలోని పంచారామక్షేత్రం ఉమాసోమేశ్వర జనార్దన స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి ఉత్సాలకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. 8లో u
భీమవరం: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మికులు బలపర్చిన పీడీఎఫ్ అభ్యర్థి దిడ్ల వీరరాఘవులకు ఓట్లు వేసి ఘన విజయం అందించాలని ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి కోరారు. శనివారం పట్టణంలో పలు విద్యాసంస్థల్లో ఉద్యోగులు, నిరుద్యోగులను కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 17 ఏళ్లుగా పీడీఎఫ్‌కు చెందిన 16 మంది ఎమ్మెల్సీలు శాసనమండలిలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలని, ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, స్కీం వర్కర్స్ సమస్యలపై ప్రభుత్వాలను నిలదీశారన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ తమ అభ్యర్థిని ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలబెట్టి రాజ్యాంగ స్ఫూర్తిని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని విమర్శించారు. సంస్కరణల పేరుతో విద్యారంగాన్ని పాలకులు సంక్షోభంలోకి నెట్టివేశారని, దీంతో మరింత అంధకారంలోకి వెళ్లే దుస్థితి నెలకొందన్నారు. యూటీఎఫ్ జిల్లా నాయకులు విజయరామరాజు, అబ్రహం, నాగబాబు, రామకృష్ణంరాజు, మల్లేశ్వరరావు, సీఐటీయూ నాయకులు బి.వాసుదేవరావు, క్రాంతిబాబు, రాము పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment