పంచారామాల్లో పటిష్ట ఏర్పాట్లు
పోడూరు: పంచారామ క్షేత్రాల వద్ద మహాశివరాత్రి వేడుకలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని దేవదాయశాఖ ఉప కమిషనర్ డీఎల్‌వీ రమేష్‌బాబు ఆదేశించారు. పాలకొల్లులోని క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయాన్ని శనివారం ఆయన సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. జిల్లా దేవదాయశాఖ అధికారి ఈవీ సుబ్బారావు, ఈఓ ముచ్చర్ల శ్రీనివాస్ ఆయన వెంట ఉన్నారు.
భీమవరంలో..
భీమవరం (ప్రకాశంచౌక్): భీమవరం గునుపూడిలోని ఉమాసోమేశ్వర జనార్దనస్వామి దేవస్థానం, భీమేశ్వరస్వామి ఆలయాల్లో శివరాత్రి కల్యాణోత్సవాల సందర్భంగా ఏర్పాట్లను ఉప కమిషనర్ రమేష్‌బాబు పరిశీలించారు. సిబ్బందికి సూచనలు ఇచ్చారు. ఈవీ సుబ్బారావు, డీవీ వెంకటేశ్వర రావు, అధికారులు పాల్గొన్నారు.
వైద్యులు అందుబాటులో ఉండాలి
భీమవరం (ప్రకాశంచౌక్): ప్రభుత్వాస్పత్రుల్లో డాక్టర్లు, సిబ్బంది అందుబాటులో ఉండాలని, రోగుల బాగోగులు ఎప్పటికప్పుడు చూసుకోవాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ నుంచి వైద్యారోగ్యశాఖ, సివిల్ సప్లయీస్, అన్న క్యాంటీన్లు, ఈ– శ్రమ పోర్టల్, గ్రామాల్లో చెత్త నుంచి సంపద సృష్టించే కేంద్రాల ఏర్పాటు, ఆధార్ నమోదుపై ఆమె గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. ఎంఎస్‌ఎంఈ సర్వేను త్వరితగతిన పూర్తిచేయాలని సూచించారు. డీఆర్వో మొగిలి వెంకటేశ్వర్లు, డీఎంహెచ్‌ఓ బి.బాలూనాయక్, జిల్లా గ్రామ వార్డు సచివాలయం అధికారి వై.దోసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
25 నుంచి వీరంపాలెంలోశివరాత్రి ఉత్సవాలు
తాడేపల్లిగూడెం రూరల్: వీరంపాలెం శైవక్షేత్రంలో ఈనెల 25, 26, 27వ తేదీల్లో మహాశివరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నట్టు శ్రీ బాలాత్రిపుర సుందరీ పీఠం వ్యవస్థాపకుడు గరిమెళ్ల వెంకటరమణ శాస్త్రి తెలిపారు. శనివారం పీఠం ఆవరణలో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. 25న ఉదయం 9.23 గంటలకు కలశ స్థాపనతో ఉత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. అదే రోజు ఉదయం ఏకాదశ రుద్రాభిషేకం, సాయంత్రం 4 గంటలకు మేథా సరస్వతీ అమ్మవారికి లక్ష పుష్పార్చన, ధ్వజారోహణ, రాత్రి భూప్రస్తార శ్రీచక్రార్చన జరుగు తుందన్నారు. 26న స్ఫటిక లింగేశ్వరస్వామి వారికి మానస సరోవర జలంతో అభిషేకం, మహాదేవునికి మహాకుంభాభిషేకం, రాత్రికి శివపార్వతుల కల్యాణం, లక్ష జ్యోతిర్లింగార్చన ఏర్పాటు చేసినట్టు చెప్పారు. 27న విశ్వేశ్వరస్వామికి ఏకాదశ రుద్రాభిషేకం, లక్షబిల్వార్చన, సంపూర్ణ పూర్ణాహుతి, సాయంత్రం శివపార్వతులకు శాంతి కల్యాణం, గ్రామోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయన్నారు.
ముగిసిన టీసీసీ పరీక్షలు
భీమవరం: జిల్లాలో జరుగుతున్న టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు (టీసీసీ) పరీక్షలు ముగిసినట్టు డీఈఓ ఈ.నారాయణ తెలిపారు. స్థానిక ఎస్‌సీహెచ్‌బీఆర్‌ఎం హైస్కూల్‌లో శనివారం ఉదయం డ్రాయింగ్ లోయర్ పరీక్షకు 70 మందికి 51 మంది, హయ్యర్ పరీక్షకు 29 మందికి 24 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం నిర్వహించిన డ్రాయింగ్ లోయర్ పరీక్షకు 70 మందికి 51 మంది, హయ్యర్ పరీక్షకు 29 మందికి 24 మంది హాజరయ్యారు.
బాలల చట్టాలు పక్కాగా అమలుచేయాలి
ఏలూరు (టూటౌన్): బాలల సంక్షేమం కోసం ఉన్న చట్టాలను అధికారులు పక్కాగా అమలుచేయాలని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్ర ధాన న్యాయమూర్తి (ఎఫ్‌ఏసీ) ఎం.సునీల్‌కుమార్ సూచించారు. స్థానిక జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనంలో శనివారం ఆయన ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా జ్యువనైల్ పోలీస్ యూనిట్‌కు జ్యువనైల్ చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. బాలల సంక్షేమ చట్టాలపై అధికారులు ఎప్పడికప్పుడు తర్ఫీదు పొంది చిన్నారుల సంక్షేమానికి కృషిచేయాలన్నారు. చట్టంతో విభేదించిన బాలలతో ప్రవర్తించాల్సిన విధి విధానాలు, వారికి కల్పించాల్సిన పునరావాస సౌకర్యాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. బాల్యవివాహాల నిరోధానికి కృషిచేయాలని ఆయన అన్నారు.
పంచారామాల్లో పటిష్ట ఏర్పాట్లు
Comments
Please login to add a commentAdd a comment