
దేశవ్యాప్తంగా కార్యకలాపాలు
నా భార్య నా మీద అసత్య ఆరోపణలతో కేసులు వేసి హింసించింది. విడాకులయ్యాయి. ఈ నేపథ్యంలో 2010లో 35 మంది సభ్యులతో సంఘం స్థాపించా. అమెరికా, మలేషియా, దుబాయ్‌ల నుంచి కూడా భార్యాబాధితులు ఫోన్‌లో సంప్రదిస్తున్నారు. మా సంఘం దేశవ్యాప్తంగా కార్యకలాపాలు చేస్తుంది. మాకు 13 డిమాండ్లు ఉన్నాయి. భార్యాబాఽధితుల రక్షణ కోసం చట్టాలు రావాల్సిందే. గౌరవం కోల్పోతున్నాం, మనశ్శాంతి ఉండటం లేదు. వ్యసనాలకు బానిసలవుతున్నాం. ఎందరో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తప్పు లేకుండా పరిహారాలు కోరవద్దు. మా ఆస్తులకు మమ్మల్ని దూరం చేస్తున్నారు. భార్యలతో ఇబ్బంది పడే భర్తల తరఫున పోరాటం కొనసాగుతుంది.
– జి.బాలాజీ రెడ్డి,
భార్యాబాధితుల సంఘం జాతీయ అధ్యక్షుడు
మార్గదర్శకాలకు లోబడే చర్యలు
భార్యాబాధితుల సంఘం తమ బాధలను వ్యక్తం చేసుకుని ఉనికిని తెలియజేసే ఒక సంఘం మాత్రమే. కుటుంబాల మధ్య వచ్చిన విభేదాలు చట్టం పరిధిలోనే పరిష్కారం కావాలి. సంఘాల తరఫున పోరాటం చేసినంత మాత్రాన కేసులు నమోదు చేసే అవకాశం లేదు. వారి ఆవేదనను వ్యక్తం చేసుకునే వేదికగా మాత్రమే భార్యాబాధితుల సంఘం పోరాటం చేస్తోంది. సంఘం ద్వారా వచ్చిన ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని కేసులు, నిర్ణయాలు వెలువడే అవకాశం లేదు. న్యాయస్థానాల మార్గదర్శకాలకు లోబడి మాత్రమే చర్యలు ఉంటాయి.
– దశిక మురళీకృష్ణ,
హైకోర్టు సీనియర్ న్యాయవాది
Comments
Please login to add a commentAdd a comment