జంగారెడ్డిగూడెం/బుట్టాయగూడెం: సినీ హీరో నితిన్ గుర్వాయిగూడెం మద్ది క్షేత్రాన్ని దర్శించుకున్నారు. హీరో నితిన్‌తో పాటు, మైత్రీ మూవీస్ అధినేత రవిశంకర్, దర్శకుడు వెంకి కుడుముల స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. తొలుత వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ ముఖమండపం వద్ద అర్చకులు వేద ఆశీర్వాదం అందజేసి స్వామి శేషవస్త్రాలు, ప్రసాదాలు అందించారు. అనంతరం బుట్టయగూడెం మండలంలోని గుబ్బల మంగమ్మ ఆలయాన్ని కూడా హీరో నితిన్ దర్శించుకున్నారు.