పాలకొల్లు సెంట్రల్: స్థానిక క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయం (క్షీరారామం)లో హుండీ ఆదాయాన్ని గురువారం లెక్కించారు. 105 రోజులకు రూ.15,01,481 ఆదాయం వచ్చి నట్టు ఆలయ ఈఓ ముచ్చర్ల శ్రీనివాస్ తెలి పారు. దేవదాయశాఖ భీమవరం డివిజన్ ఇన్‌స్పెక్టర్ వర్ధినీడి వెంకటేశ్వరరావు, ఈఓలు రంగరాజన్, నాగజ్యోతి పర్యవేక్షించారు.
చినఅమిరం పంచాయతీజూనియర్ అసిస్టెంట్ అరెస్ట్
భీమవరం: భీమవరం టూటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని భీమవరం మండలం చినఅమిరం పంచాయతీలో నిధులు దుర్వినియోగం కేసులో జూనియర్ అసిస్టెంట్ గుండు రామకృష్ణను గురువారం అరెస్టు చేసినట్లు డీఎస్పీ ఆర్‌జీ జయసూర్య తెలిపారు. నిందితుడిని రెండో అదనపు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ముందు హాజరు పర్చగా 15 రోజుల రిమాండ్ విధించారన్నారు. మండలంలోని చినఅమిరం, రా యలం గ్రామాల్లో గతంలో పంచాయతీ కార్యదర్శులుగా పనిచేసిన సాగి కిషోర్ కుమార్‌రాజు, దున్న జయరాజుల హయాంలో సుమారు రూ.2.16 కోట్లు దుర్వినియోగం జరిగినట్లు అధికారులు నిర్ధారించగా ఈనెల 12న కిషోర్‌కుమార్‌రాజు, జయరాజులను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
సీడబ్ల్యూసీకి చిన్నారులు
జంగారెడ్డిగూడెం: మారుటి తండ్రి దాడిలో గాయపడి, చికిత్స పొందుతూ కోలుకున్న చిన్నారులను గురువారం ఐసీడీఎస్ అధికారులు సీడబ్ల్యూసీ (చైల్డ్ వెల్ఫేర్ కమిటీ) ముందు హాజరు పరిచారు. జంగారెడ్డిగూడెం ఐసీడీఎస్ సీడీపీఓ మాట్లాడుతూ జంగారెడ్డిగూడెంలో నివాసం ఉంటున్న ఎ.జోత్స్న భర్త నుంచి విడిపోయి రెండో వివాహం చేసుకుంది. మొదటి భర్త ద్వారా కలిగిన సంతానం సాత్విక్ (11), కరుణ సత్య (8)తో కలిసి రెండో భర్త పి. దుర్గాప్రసాద్ వద్ద ఉంటోంది. ఇటీవల మారుటి తండ్రి దుర్గాప్రసాద్ మద్యం సేవించి వచ్చి చిన్నారులను తీవ్రంగా కొట్టడంతో గాయపడిన సాత్విక్‌కు జంగారెడ్డిగూడెం ఏరియా ఆస్ప త్రిలో చికిత్స అందించారు. పోలీసు శాఖ, ఐసీడీఎస్ అధికారులు సాత్విక్, కరుణ సత్యలను జీఎంఎస్‌కే గంగారత్నం ద్వారా ఏలూరు సీడబ్ల్యూసీ ముందు హాజరు పరిచారు. సీడబ్ల్యూసీ నిర్ణయం మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని బ్యూల తెలిపారు.
అందుబాటులో టీచర్లసీనియార్టీ జాబితా
ఏలూరు(ఆర్‌ఆర్‌పేట): పూర్వ పశ్చిమగోదా వరి జిల్లాలోని ప్రభుత్వ, జెడ్పీ, మండల పరిషత్, మున్సిపాల్టీ, కార్పొరేషన్ల యాజమాన్యా ల్లో పనిచేస్తున్న హెచ్‌ఎంలు, ఉపాధ్యాయుల సీనియార్టీ జాబితా రూపొందించామని డీఈఓ ఎం.వెంకటలక్ష్మమ్మ ప్రకటనలో తెలిపారు. జాబితాను పూర్వ పశ్చిమగోదావరి జిల్లా పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్‌లో, నోటీసు బోర్డుల్లో అందుబాటులో ఉంచామన్నారు. జాబితాపై ఎవరైనా అభ్యంతరాలుంటే ఈనెల 25లోపు సమర్పించవచ్చన్నారు.
‘ఆశ్రం’ విద్యార్థుల ప్రతిభ
దెందులూరు: ఏలూరులోని ఆశ్రం వైద్య కళాశాల విద్యార్థులు 2024 ఎంబీబీఎస్ పరీక్షా ఫలితాల్లో సత్తాచాటారు. 257 మంది విద్యార్థులకు 238 మంది ఉత్తీర్ణులయ్యారని ప్రిన్సిపాల్ చేబ్రోలు శ్రీనివాస్ తెలిపారు. ఫైనల్ ఎంబీబీఎస్ పార్ట్–1లో నూరు శాతం ఉత్తీర్ణత సాధించారన్నారు.
తాగునీటి సమస్య తలెత్తితే ఊరుకోం
ఏలూరు(మెట్రో): రానున్న వేసవిలో జిల్లాలో అధికారుల నిర్లక్ష్యంతో ఎక్కడైనా తాగునీటి సమస్య తలెత్తితే ఊరుకోబోమని ఏలూరు కలెక్టర్ కె.వెట్రిసెల్వి హెచ్చరించారు. కలెక్టరేట్‌లో గురువారం తాగునీటి సరఫరా, జల్ జీవన్ మి షన్ పథకాల అమలుపై ఆమె సమీక్షించారు. తాగునీటికి సంబంధించి సమస్యాత్మక గ్రామాలను ముందుగానే గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు. వేసవిలో తాగునీటి సరఫరాపై వారంలోపు కార్యాచరణ ప్రణాళికను రూపొందించి సమర్పించాలని ఆదేశించారు.
క్షీరారామం హుండీ ఆదాయం లెక్కింపు