లారీ ఢీకొని ఉపాధ్యాయురాలి మృతి | - | Sakshi
Sakshi News home page

లారీ ఢీకొని ఉపాధ్యాయురాలి మృతి

Published Sat, Mar 22 2025 12:53 AM | Last Updated on Sat, Mar 22 2025 1:04 AM

లారీ ఢీకొని ఉపాధ్యాయురాలి మృతి

లారీ ఢీకొని ఉపాధ్యాయురాలి మృతి

పెనుమంట్ర: మండలంలోని నెగ్గిపూడి గ్రామ పంచాయతీ సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం టిప్పర్‌ లారీ స్కూటర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మార్టేరులోని ఒక ప్రైవేట్‌ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్న సిర్ల సుజాత (55) అక్కడికక్కడే మృతి చెందింది. మృతదేహం తలపై నుంచి లారీ టైరు వెళ్లడంతో నుజ్జునుజ్జు అయ్యింది. భోజన విరామ సమయంలో తన యాక్టివా మోటార్‌ సైకిల్‌పై పాఠశాల నుంచి నెగ్గిపూడిలోని ఇంటికి వెళ్తుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆమె భర్త సిర్ల చిన్న సూర్యనారాయణ రెడ్డి ఫిర్యాదు మేరకు పెనుమంట్ర ఎస్సై కె.స్వామి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

విద్యార్థిని ఆత్మహత్య

తాడేపల్లిగూడెం రూరల్‌: అనారోగ్య సమస్యలతో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శుక్రవారం మండలంలోని కొమ్ముగూడెం గ్రామంలో చోటు చేసుకుంది. రూరల్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కొమ్ముగూడెం గ్రామానికి చెందిన బాలిక (15) అనారోగ్య సమస్యలతో బాధపడుతుంది. ఈక్రమంలో శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు బాలిక తల్లి సకినాల సుజని రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడేపల్లిగూడెం ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రూరల్‌ ఎస్సై ప్రసాద్‌ దర్యాప్తు చేస్తున్నారు.

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

భీమవరం: స్థానిక వన్‌టౌన్‌లో ఓ గదిలో ఉంటున్న యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం ఇటికంపాడుకు చెందిన గిరిపరమేశ్వర్‌ (20) భీమవరంలోని ఆర్టీసీ గ్యారేజీకి ఓ ఏడాది శిక్షణ నిమిత్తం ఫిబ్రవరి 18న వచ్చాడు. మార్చి 20న తల్లిదండ్రులు ఫోన్‌ చేస్తే రింగ్‌ అవుతున్నా లిఫ్ట్‌ చేయకపోవడంతో అనుమానంతో వేరొకరికి ఫోన్‌ చేసి చూడమని కోరగా ఆ వ్యక్తి యువకుడు ఉంటున్న గది దగ్గరకు వెళ్లి తలుపు తెరిచి చూసే సరికి గదిలోని ఫ్యానుకు ఉరివేసుకుని నేలకు తాకుతూ వేలాడుతూ కనిపించాడు. ఈ విషయాన్ని మృతుడి తల్లిదండ్రులకు చెప్పడంతో శుక్రవారం మృతుడి తండ్రి మస్తాన్‌ రావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఎస్సై బి.వై కిరణ్‌ కుమార్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

గ్రామీణాభివృద్ధిపై సమీక్ష

ఏలూరు(మెట్రో): గ్రామీణాభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం శుక్రవారం స్థానిక జెడ్పీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించారు. జెడ్పీ చైర్‌పర్సన్‌ జి.పద్మశ్రీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఉపాధి హామీ పథకం అమలు తీరు, సీసీ రోడ్ల నిర్మాణం, ఫామ్‌ పాండ్లు, పశు షెడ్ల నిర్మాణాలు తదితర అంశాలపై సమీక్షించారు. జెడ్పీ సీఈఓ భీమేశ్వర్‌, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల డ్వామా, డీఆర్డీఏ, గృహ నిర్మాణ శాఖ పీడీలు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

భీమడోలు: జాతీయ రహదారి భీమడోలు కనకదుర్గమ్మ గుడి వద్ద శుక్రవారం ఓ మోటార్‌ బైక్‌ను వెనుక నుంచి కారు ఢీకొట్టడంతో వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పెదవేగి మండలం వేగివాడకు చెందిన గంటా భరత్‌(21), గోపాలపురానికి చెందిన చల్లా సుబ్రహ్మణ్యం ఇద్దరూ స్నేహితులు. వారు శుక్రవారం వ్యక్తిగత పనుల నిమిత్తం ఏలూరు నుంచి తాడేపల్లిగూడెం బైక్‌పై వెళ్లి పనులు ముగించుకుని తిరిగి స్వగ్రామానికి వచ్చేందుకు భీమడోలు వైపుగా వస్తున్నారు. కనకదుర్గ గుడి వద్దకు వచ్చేసరికి వెనుక నుంచి అతివేగంగా వచ్చిన కారు బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయాయ్యి. వారిని భీమడోలు సామాజిక ఆరోగ్య కేంద్రానికి చికిత్స నిమిత్తం తరలించారు. అక్కడ ప్రాథమిక వైద్యం చేసి ఏలూరు వైద్యశాలకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ గంటా భరత్‌(21) మృతి చెందాడు. తీవ్ర గాయాలైన సుబ్రహ్మణ్యాన్ని విజయవాడ తరలించారు. ఈ మేరకు భీమడోలు ఎస్సై వై.సుధాకర్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement