
ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర కమిటీ ఎన్నిక
పెదవేగి: మండలంలోని విజయరాయి సీతారామ కల్యాణ మండపంలో శుక్రవారం కోకో రైతుల రాష్ట్ర కమిటీను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా బొల్లు రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి గా కె.శ్రీనివాస్, రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా ఎస్.గోపాలకృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బోళ్ల సుబ్బారావు (పశ్చిమగోదావరి), పానుగంటి అచ్యుతరామయ్య (ఏలూరు), ఉప్పుగంటి భాస్కరరావు (కోనసీమ), గుదిబండి బండి వీరారెడ్డి (ఏలూరు), మార్ని శ్రీనివాసరావు (తూర్పుగోదావరి) సహాయ కార్యదర్శులుగా ఉప్పల కాశీ (తూర్పుగోదావరి), కొసరాజు రాధాకష్ణ (ఏలూరు), కొప్పిశెట్టి ఆనంద వెంకటప్రసాద్ (కోనసీమ), కోశాధికారిగా జాస్తి కాశీ బాబు (ఏలూరు) మరో 35 మందితో రాష్ట్ర నూతన కమిటీని ఎన్నుకున్నారు. కోకో రైతుల సమస్యలను పరిష్కరించాలని 24, 25 తేదీల్లో కోకో సాగు చేస్తున్న అన్ని జిల్లాల్లో ధర్నాలు, రాస్తారోకో కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు నూతన కమిటీ సభ్యులు పేర్కొన్నారు.