
‘సాక్షి’పై అరకమ కేసులు ఎత్తివేయాలి
భీమవరం: పల్నాడు జిల్లా మాచర్లలో జరిగిన హత్యకు సంబంధించి ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి ‘సాక్షి’ ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డితోపాటు ఆరుగురు పాత్రికేయులపై అక్రమ కేసులు నమోదు చేయడంపై రెండో రోజూ శనివారం జిల్లాలో పాత్రికేయులు గళమెత్తారు. భీమవరంలో ఏపీయూడబ్ల్యూజే, భీమవరం ఏరియా ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. డీఎస్పీ కార్యాలయానికి వెళ్లి డీఎస్పీ ఆర్‌జీ జయసూర్యకు వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు వీఎస్ సాయిబాబా, రాష్ట్ర కమిటీ సభ్యుడు యర్రంశెట్టి గిరిజాపతి మాట్లాడుతూ అక్రమ కేసు లను తక్షణం ఉపసంహరించుకోవాలని, పత్రికా స్వేచ్ఛను కాపాడాలని, రాష్ట్రంలో జర్నలిస్టులపై దాడులు అరికట్టాలని డిమాండ్ చేశారు. ప్రెస్‌క్లబ్ కార్యదర్శి కమ్మిల హనుమంతరావు, జిల్లా ఉపాధ్యక్షుడు కేఎస్‌ఆర్‌కే గోపాలకృష్ణ, పాత్రికేయులు పి.విజయ్‌కుమార్, ఎ.శ్రీనివాస్, రవి, ఎన్.నాగరాజు, ఎన్.సత్యనారాయణ, రాజాబాబు, వీపీవీ అప్ప య్య, చిన్నారి తదితరులు పాల్గొన్నారు.
తాడేపల్లిగూడెంలో గళమెత్తి..
తాడేపల్లిగూడెం: ఏపీయూడబ్ల్యూజే, తాడేపల్లిగూడెం ఏరియా ప్రెస్‌క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక డీఎస్పీ కార్యాలయం వద్ద పాత్రికేయులు నిరసన తెలిపారు. ఐజేయూ (ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్) కార్యదర్శి డి.సోమసుందర్ మాట్లాడుతూ ‘సాక్షి’ సంపాదకులపై కేసు నమోదు కక్ష సాధింపు చర్యగా కనిపిస్తోందన్నారు. ప్రభుత్వం, పోలీసులు కలిసి రాజకీయ ద్వేషాలను జర్నలిస్టుల మీద చూ పించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రభుత్వం తీరు మార్చుకోకుంటే పెద్దఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఏపీయుడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి గజపతి ప్రసాద్, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు టి.రంగసురేష్, యూనియన్ రాష్ట్ర నాయకుడు యడ్లపల్లి మురళీకృష్ణ, ప్రెస్ క్లబ్ సభ్యులు పాలడుగు సతీష్, పెద్దోజు మురళీ, పుండరీ, కె.వెంకట్రావు, కళింగ లక్ష్మణరావు, కె.ఆశీర్వాదరావు, కేవీ కృష్ణారావు, శీలి రాజు తదితరులు పాల్గొన్నారు. అనంతరం డీఎస్పీ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.
గళమెత్తిన పాత్రికేయులు

‘సాక్షి’పై అరకమ కేసులు ఎత్తివేయాలి