
రెండోరోజూ మట్టి నమూనాల పరిశీలన
పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టులో మట్టి నాణ్యత పరీక్షలను గురువారం రెండవ రోజు కూడా కేంద్ర బృందం సభ్యులు పరిశీలన చేశారు. సెంట్రల్ మెటీరియల్ అండ్ సాయిల్ రీసెర్చ్ సెంటర్ నిపుణులు బి.సిద్దార్ధ హెడవో, విపుల్ కుమార్ గుప్త ప్రాజెక్టు ప్రాంతంలోని దండంగి, జలవిద్యుత్ కేంద్ర పరిసర ప్రాంతాల్లో నిల్వ చేసిన మట్టి నమూనాలు సేకరించారు. ఈ మట్టిని స్థానిక లేబోరేటరీలో పరీక్షించడంతో పాటు మరింత సూక్ష్మంగా పరిశీలించేందుకు ఢిల్లీ కేంద్ర కార్యాలయంలో పరీక్షించేందుకు సేకరించారు. క్షేత్రస్థాయిలో సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ సెంటర్‌లో నిర్వహించే పరీక్షల్లో వచ్చిన ఫలితాల ఆధారంగా పోలవరం ప్రాజెక్టులో ఈసీఆర్‌ఎఫ్, డయాఫ్రమ్‌వాల్ ప్రాంతాల్లో అవసరమైన మేర ఈ మట్టిని వినియోగిస్తారని జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. వీరి వెంట ప్రాజెక్టు ఈఈ శ్రీనివాసులు, డీఈ వి.నిర్మల, మేఘ ఇంజనీరింగ్ ప్రతినిధులు పాల్గొన్నారు.
ఆయుష్మాన్ సీహెచ్ ఆఫీసర్ల సమస్యలు పరిష్కరించాలి
పాలకొల్లు సెంట్రల్: ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం ఉద్యోగ భద్రత కల్పించి 23 శాతం జీతం పెంచాలని లంకలకోడేరు పీహెచ్‌సీ కన్వీనర్ గౌతమి తెలిపారు. గురువారం లంకలకోడేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద వైద్య ఆరోగ్య శాఖలో నేషనల్ హెల్త్ మిషన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కార్యక్రమంలో మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్, సీహెచ్‌ఓలుగా పని చేస్తున్న సిబ్బంది జీతభత్యాల సమస్యలు పరిష్కరించాలంటూ స్థానిక ఎన్‌జీఓ యూనిట్ అధ్యక్షుడు గుడాల హరిబాబుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గౌతమి మాట్లాడుతూ పని ఆధారిత ప్రోత్సాహకాలను సవరించాలని, ఈపీఎఫ్‌ను పునరుద్దరించాలని, క్లినిక్ అద్దె బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో సుజిత, రాజశ్రీ, యువతేజ, స్రవంతి, కృష్ణవేణి, లిఖిత, శైలజ, శిరీష, అన్నప్రైస్, శ్రావణి తదితరులు పాల్గొన్నారు.
వందశాతం లక్ష్యాలను పూర్తి చేయాలి
ఏలూరు(మెట్రో): ప్రభుత్వ పథకాల ప్రగతి సాధనలో వందశాతం లక్ష్యాలను పూర్తి చేయాలని ఇన్‌చార్జి కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం విజయవాడ ఏపీ సచివాలయంలోని సీఎస్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.

రెండోరోజూ మట్టి నమూనాల పరిశీలన