![నృసిం](/styles/webp/s3/article_images/2025/02/16/16022025-ydd_tab-01_subgroupimage_1889331696_mr-1739650953-0.jpg.webp?itok=sGwQ15ri)
నృసింహుడికి లక్ష పుష్పార్చన
నేటి నుంచి సమగ్ర
కుటుంబ సర్వే
భువనగిరి టౌన్ : సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొనని వారికోసం మరోసారి సోమవారం నుంచి ఈనెల 28వ తేదీ వరకు సర్వే నిర్వహిస్తామని కలెక్టర్ హనుమంతరావు శనివారం ఒక ప్రకటలో తెలిపారు.రోజూ ఉదయం 9నుంచి సాయంత్రం 5 గంటల వరకు సర్వే కొనసాగుతుందన్నారు. దరఖాస్తు ఫారాన్ని pcsurv ey.cgg.gov.in వెబ్‌సెట్‌లో డౌన్‌లోడ్ చేసుకుని వివరాలు నమోదు చేసి ప్రజాపాలన సేవా కేంద్రాల్లో అందజేయాలని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సందేహాలు, వివరాల కోసం టోల్‌ఫ్రీ నంబర్ 040–211111111ని సంప్రదించవచ్చన్నారు.
నూతన కమిటీ ఎన్నిక
భువనగిరి టౌన్ : తెలంగాణ ఎకనామిక్, స్టాటిస్టిక్స్ సెల్ ఆర్డినేట్స్ అసోసియేషన్ జిల్లా నూతన కమిటీని శనివారం భువనగిరిలో నిర్వహించిన సమావేశంలో ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా వడ్డేపల్లి వినోద్‌కుమార్, సెక్రటరీగాగా జయంత్, ఉపాధ్యక్షుడిగా గుణగంటి వెంకటేష్, జాయింట్ సెక్రటరీగా కృష్ణ, కోశాధికారిగా సంతోష్‌కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా శ్రీను, పబ్లిసిటీ సెక్రటరీగా శ్రావణి, ఇ.సి మెబర్లుగా శారద, భభిత ఎన్నికయ్యారు. తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ధరణికోట భగత్ ఆధ్వర్యంలో కమిటీని ఎన్నుకున్నారు. జేఏసీ చైర్మన్ జగన్‌మోహన్ ప్రసాద్, కార్యదర్శి, కోశాధికారి శ్రీకాంత్, టీజీవోఎస్ కోశాధికారి ఉపేందర్‌రెడ్డి తదితరులు నూతన కమిటీని సత్కరించారు.
ఆధునిక పద్ధతులతో అధిక దిగుబడి
మోటకొండూర్ : వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు పాటించడం వల్ల అధిక దిగుబడులు సాధించవచ్చని ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయ విద్యార్థులు రైతులకు సూచించారు.స్టడీటూర్‌లో భాగంగా శనివారం మోట కొండూరులో పర్యటించారు. పంటల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బొమ్మల రూపంలో చిత్రం వేసి రైతులకు వివరించారు.
అలరించిన ‘కూచిపూడి’
యాదగిరిగుట్ట రూరల్ : యాదగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో శనివారం సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీథర్ కూచిపూడి ఆర్ట్స్ అకాడమీ (పెండం నాగశ్రీ) హైదరాబాద్ బృందం కళాకారుల కూచిపూడి నాట్యం ఆకట్టుకుంది.
![నృసింహుడికి లక్ష పుష్పార్చన 1](/gallery_images/2025/02/16/15alr801-230111_mr-1739650953-1.jpg)
నృసింహుడికి లక్ష పుష్పార్చన
Comments
Please login to add a commentAdd a comment