
ఎన్నికలు ఏవైనా మనమే గెలవాలి
చౌటుప్పల్ : ఎన్నికలు ఏవైనా విజయం మనదే అవ్వాలని, అందుకోసం ప్రతి కార్యకర్త శక్తివంచన లేకుండా పనిచేయాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి గంగాపురం కిషన్‌రెడ్డి సూచించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు శనివారం హైదరాబాద్ నుంచి నల్లగొండకు వెళ్తుండగా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధి లింగోజిగూడెంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు రమనగోని శంకర్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. మంత్రితో పాటు ఆయన వెంట ఉన్న బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్‌రెడ్డిని పూలమాలలు, శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇప్పుడు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలైనా, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలైనా బీజేపీ అభ్యర్థులే గెలవా లన్నారు. ఇప్పటికే ప్రజలు గత బీఆర్‌ఎస్, ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో విసిగిపోయారని, ప్రత్యామ్నాయంగా బీజేపీనే కోరుకుంటున్నారని పేర్కొన్నారు. బూత్‌స్థాయి నుంచి ప్రతి కార్యకర్త సైనికుడిలా కష్టపడి పార్టీని గెలిపించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మునుగోడు అసెంబ్లీ కన్వీనర్ దూడల భిక్షంగౌడ్, చౌటుప్పల్ మండల, మున్సిపల్ అధ్యక్షులు కై రంకొండ అశోక్, కడారి కల్పన, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కంచర్ల గోవర్ధన్‌రెడ్డి, నాయకులు దాసోజు భిక్షమాచారి, బత్తుల జంగయ్య, చినుకని మల్లేష్, కడారి అయిలయ్య, ఊదరి రంగయ్య, ఇటికాల దామోదర్‌రెడ్డి, పర్నె శేఖర్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, ఎర్ర నర్సింహ, బాతరాజు గణేష్, లింగస్వామి, శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.
ఫ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment