
‘రీజినల్’ నిర్వాసితులను ఆదుకోవాలి
చౌటుప్పల్ రూరల్: రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పొతున్న నిర్వాసితులను ప్రభుత్వం ఆదుకోవా లని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. శనివారం ఖమ్మం వెళ్తూ చౌటుప్పల్ మండలం ఎల్లంబావి గ్రామ పరిధిలోని విలేజ్ ఆహారం హోటల్ వద్ద ఆగారు. మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి బీఆర్‌ఎస్ కార్యకర్తలతో కలిసి కవితకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడారు. సీఎం రెవంత్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో ఈ ప్రాంతానికి వచ్చి త్రిబుల్ ఆర్ సమస్యనే లేకుండా చేస్తానని చెప్పారని గుర్తు చేశారు. గెలిచి 14నెలలు అవుతున్నా ఇప్పటి వరకు బాధితులను కలవలేదన్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి నిర్వాసితులకు అండగా ఉంటానని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చి నేడు మొఖం చాటేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సీఎం స్పందించి నిర్వాసితులతో మాట్లాడి వారి సమస్యలు పరి ష్కరించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి చొరవ తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పీఏఎసీఎస్ చైర్మన్ చింతల దామోదర్‌రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ బొడ్డు శ్రీనివాస్‌రెడ్డి, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు గిర్కటి నిరంజన్‌గౌడ్, ఉపాధ్యక్షులు చిన్నం బాలరాజు,మెట్టు మహేశ్వర్‌రెడ్డి, ఉడుగు మల్లేశం,మాజీ సర్పంచ్ సుర్వి యాదయ్య,మాచర్ల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఫ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
Comments
Please login to add a commentAdd a comment