
డీఎస్సీ – 2008 అభ్యర్థులకు పోస్టింగ్
భువనగిరి : ఎస్సీ–2008 అభ్యర్థులకు శనివారం డీఈఓ కార్యాలయంలో కౌన్సిలింగ్ నిర్వహించారు.30 మందికి గాను 24మంది కౌన్సిలింగ్‌కు హాజరుకాగా వారికి జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణ నియామక ఉత్తర్వులు అందజేశారు. మిగితా ఆరుగురికి పోస్టు ద్వారా పంపుతామని చెప్పారు. అభ్యర్థులు ఈ నెల 17వ తేదీన సంబంధిత ఎంఈఓలకు రిపోర్టు చేసి తమకు కేటాయించిన పాఠశాలల్లో విధుల్లో చేరాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏడీ ప్రశాంత్‌రెడ్డి, ప్రధానో పాధ్యాయుడు పాండునాయక్, సత్యనారాయణరెడ్డి, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment