నేడు వాటర్‌షెడ్ యాత్ర
సంస్థాన్ నారాయణపురం : నీటి సంరక్షణ పనులకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉపాధిహామీ పథకం ద్వారా అమలయ్యే వాటర్‌షెడ్ పనులపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. శుక్రవారం సంస్థాన్‌నారాయణపురం మండలంలోని పుట్టపాక, జనగాం గ్రామాల్లో వాటర్‌షెడ్ యాత్ర చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు, వాటర్‌షెడ్ ఏర్పాటు ప్రతిపాదిత ప్రాంతాలను వారు పరిశీలించారు. వారి వెంట ఎంపీడీఓ ప్రమోద్‌కుమార్, సత్యం తదితరులు ఉన్నారు.
‘ఒకే దేశం ఒకే ఎన్నిక’తో ప్రజాధనం ఆదా
ఆలేరురూరల్ : రాష్ట్రాల్లో తరుచూ జరుగుతున్న ఎన్నికల వల్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని, ఒకే దేశం ఒకే ఎన్నికతో ఆదా అవుతుందని, దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఊట్కూరి అశోక్‌గౌడ్ పార్టీ కార్యకర్తలకు సూచించారు. ‘ఒకే దేశం ఒకే ఎన్నిక’పై గురువారం ఆలేరులోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యలయంలో ఆయన మాట్లాడారు. పలుమార్లు ఎన్నికలు జరగడం వల్ల సామన్యులు ఆర్థిక భారంతో పోటీ చేయలేకపోతున్నారని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరిగితే మరింత పురోగతి సాధించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఆలేరు మండల అధ్యక్షుడు పూజారి కుమారస్వామి, జిల్లా కౌన్సిల్ సభ్యుడు బోగ శ్రీనివాస్, మండల కన్వీనర్ బైరి మహేందర్, అమరేందర్, శంకర్, ప్రశాంత్, సుధగాని సురేష్, కంతి రవి, రాజు, వెంకటేష్, శ్రీను, కిషన్, సందీప్, సారయ్య తదితరులు పాల్గొన్నారు.
కొండా లక్ష్మణ్ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
భువనగిరిటౌన్ : జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్రస్థాయి అవార్డుల కోసం ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానిస్తుందని చేనేత, జౌళిశాఖ సహాయ సంచాలకులు ఇందిర గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వృత్తి నైపుణ్యత, ప్రత్యేకతల ఆధారంగా అవార్డుకు ఎంపిక చేస్తారని పేర్కొన్నారు. ఏప్రిల్ 15వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
యాదగిరి క్షేత్రంలో సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో గురువారం సంప్రదాయ పూజలు ఆగమశాస్త్రం ప్రకారం కొనసాగాయి. వేకువజామున ఆలయాన్ని తెరచిన అర్చకులు.. శ్రీస్వామి అమ్మవార్లకు సుప్రభాత సేవ చేపట్టారు. అనంతరం గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులను నిజాభిషేకం, తులసీ దళాలతో అర్చించారు. ఇక ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహహోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, ముఖ మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించారు.
నేడు ఉపకరణాల పంపిణీ
భువనగిరి : జిల్లాలో గుర్తించిన దివ్యాంగులైన చిన్నారులకు శుక్రవారం ఉపకరణాలు పంపిణీ చేయనున్నట్లు డీఈఓ సత్యనారాయణ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సమగ్ర శిక్ష, ఆర్టిఫీషియాల్ లింబ్స్ కార్పొరేషన్ ఇండియా సంయుక్తంగా గత సంవత్సరం ఆగస్టులో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరంలో వైకల్య పరీక్షలు నిర్వహించి 159 మంది చిన్నారులను అర్హులుగా గుర్తించారు. భువనగిరిలోని బాగాయత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలోని పెన్షనర్స్ భవనంలో ఏర్పాటు చేసే కార్యక్రమంలో ఉపకరణాలు పంపిణీ చేస్తామన్నారు.
నేడు వాటర్‌షెడ్ యాత్ర
నేడు వాటర్‌షెడ్ యాత్ర
Comments
Please login to add a commentAdd a comment