స్వర్ణగిరి వేంకటేశ్వర స్వామికి తిరువీధి ఉత్సవ సేవ
భువనగిరి: భువనగిరి పట్టణ శివారులోని స్వర్ణగిరి శ్రీవేంకటేశ్వర స్వామి దేవాలయంలో గురువారం రాత్రి స్వామి వారికి తిరువీధి ఉత్సవ సేవ నిర్వహించారు. అంతకు ముందు ఆలయంలో సుప్రభాత సేవ, తోమాల సేవ, సుదర్శన నరసింహ హవనం, తిరుప్పావడ సేవ,, నిత్య కల్యాణం జరిపించారు. మధ్యాహ్నం సుమారు 5వేల మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక చైర్మన్ మానేపల్లి రామారావు, అర్చకులు పాల్గొన్నారు.
5 లీటర్ల సారా పట్టివేత
కొండమల్లేపల్లి: మండలంలోని చింతచెట్టుతండా నుంచి కొండమల్లేపల్లికి గురువారం ఓ వ్యక్తి బైక్‌పై తరలిస్తున్న 5 లీటర్ల నాటు సారాను ఎకై ్సజ్ పోలీసులు పట్టుకున్నారు. సమాచారం మేరకు తనిఖీ చేసి సారాను స్వాధీనం చేసుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎకై ్సజ్ సీఐ శ్రీనివాస్ తెలిపారు.