భువనగిరిటౌన్ : మాదకద్రవ్యాల రవాణా అరికట్టేందుకు జిల్లా యంత్రాంగం సమష్టిగా కృషి చేయాలని కలెక్టర్ హనుమంతరావు సూచించారు. మహిళా, శిశు, వికలాంగుల, వయో వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్‌లో జరిగిన నషా ముక్త్ భారత్(మిషన్ పరివర్తన ) జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. మాదక ద్రవ్యాల రవాణాపై పటిష్ట నిఘా ఉంచాలని, అక్రమార్కులపై ఉక్కుపాదం మోపాలన్నారు. మత్తు పదార్థాలకు బానిసలైన వ్యక్తులకు రిహాబిలిటేషన్ సెంటర్ల ద్వారా చికిత్స అందజేయాలని కోరారు. అంతకుముందు ‘డ్రగ్స్ కు నో చెప్పండి’ అనే నినాదంతో రూపొందించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ లక్ష్మీనారాయణ, సంక్షేమ అధికారి నరసింహారావు, ఎకై ్సజ్ సీపీఐ రాధాకృష్ణ, డీఎంహెచ్‌ఓ మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ హనుమంతరావు