రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు సమస్యలు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. క్షేత్రస్థాయిలో పర్యవేక్షించేందుకు ఇంజనీరింగ్ అధికారుల కొరత ఉంది. భువనగిరి డివిజన్‌కు ఒకరు, చౌటుప్పల్ డివిజన్‌కు ఒకరు చొప్పున ఇద్దరు డీఈలు మాత్రమే ఉన్నారు. మండలానికి ఒక ఏఈ ఉన్నారు. ప్రస్తుతం మండలానికి ఒక గ్రామాన్ని పైలెట్‌గా తీసుకుని ఇళ్ల నిర్మాణం చేస్తుండడంతో ఇబ్బందిలేదు. అన్ని గ్రామాల్లో ఇళ్ల నిర్మాణాలు మొదలైతే పర్యవేక్షణకు, బిల్లులు చెల్లింపుల్లో జాప్యం ఏర్పడే అవకాశం లేకపోలేదు.