భువనగిరి టౌన్ : సామరస్యమే అన్ని మతాల పండుగల సూత్రమని ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, కలెక్టర్ హనుమంతరావు పేర్కొన్నారు. రంజాన్‌ను పురస్కరించుకొని శుక్రవారం భువనగిరిలో అధికారికంగా ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌లో వారు మాట్లాడారు. కులమతాలకు అతీతంగా జరుపుకునే పండుగలు భారత లౌకిక విధానాన్ని బలోపేతం చేస్తున్నాయన్నారు. రంజాన్‌ను సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. అంతకుముందు ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ కృష్ణారెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎండీ అవేజ్ చిస్తీ, ముస్లిం మత పెద్దలు, నాయకులు పాల్గొన్నారు.
ఫ ఇఫ్తార్ విందులో ఎంపీ,
భువనగిరి ఎమ్మెల్యే, కలెక్టర్