ఫిలిప్పీన్స్‌కు యాదాద్రి బియ్యం
సాక్షి,యాదాద్రి : భువనగిరి జిల్లా నుంచి ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతి అవుతున్నాయి. తెలంగాణ నుంచి 8లక్షల టన్నుల బియ్యం ఎగుమతికి రాష్ట్ర ప్రభుత్వంతో ఫిలిప్పీన్స్ దేశం ఒప్పందం కుదర్చుకుంది. ఇందులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని నాలుగు మిల్లుల నుంచి 1,570 మెట్రిక్ టన్నులు బియ్యం ఎగుమతి చేయాల్సి ఉంది. తొలి విడతలో గురువారం 570 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ పోర్టుకు లారీల ద్వారా చేరవేశారు. అక్కడి నుంచి నౌకలో ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతి చేయనున్నారు. మిగతా వెయ్యి మెట్రిక్ టన్నుల బియ్యాన్ని త్వరలో ఎగుమతి చేయనున్నారు. మరో 2 వేల మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతికి ఆర్డర్ లభించే అవకాశం ఉంది. కాగా జిల్లాలోని మిల్లుల్లో మర ఆడించిన బియ్యంలో చాకీ ఎక్కువ ఉందని రెండు నెలల క్రితం తిరస్కరించారు. దీంతో సివిల్ సప్లై అధికారులు మరోసారి ఫిలిప్పీన్స్ అధికారులను రప్పించి బియ్యం నాణ్యతను చూపడంతో ఎగుమతికి వారు అంగీకరించారు.
ఇఫ్తార్ 6–34 (శనివారం సాశ్రీశ్రీ) సహర్ 4–50 (ఆదివారం