సాహితీ లోకానికి నిజమైన పండుగ ఉగాది
భువనగిరి: సాహితీ లోకానికి నిజమైన పండుగ ఉగాది అని జాతీయ ఉత్తమ సినీ గేయ పురస్కార గ్రహీత సుద్దాల అశోక్ తేజ అన్నారు. జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో శ్రీ విశ్వావసు నామ ఉగాది ఉత్సవాలు– 2025లో భాగంగా గురువారం రాత్రి భువనగిరి మండలంలోని రాయగిరి గ్రామ పరిధిలో గల సోమ రాధాకృష్ణ ఫంక్షన్ హాల్‌లో కవి సమ్మేళనం– ఉగాది పురస్కారాల ప్రదానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కవులు, రచయితలకు తమ రచనల ద్వారా సమాజాన్ని చైతన్య పరిచే శక్తి ఉంటుందన్నారు. అతి ప్రాచీన కాలం నుంచి కవులు ఉగాది సందర్భంగా కొత్త రచనలు చేస్తుండడం జరుగుతుందన్నారు. గతంలో భువనగిరి నుంచి ఎంతో మంది కవులు జాతీయ స్థాయికి ఎదిగారని, వారిని స్ఫూర్తిగా తీసుకుని ప్రస్తుతం ఉన్న కవులు, రచయితలు ఎదగాలన్నారు. అనంతరం శెట్టి బాలయ్య యాదవ్, విరువంటి గోపాలకృష్ణ, లెక్కల మల్లారెడ్డి, హజారి జనార్దన్‌రావు, తోట వెంకటేశ్వరరావులకు జీవన సాఫల్య పురష్కారాలు అందజేశారు. అనంతరం బండారు జయశ్రీ, దండమూడి శ్రీచరణ్, డాక్టర్ పాండాల మహేశ్వర్, వంగలరి ప్రణయరాజ్, బైరపాక స్వామిలకు సాహిత్య పురష్కారాలను డాక్టర్ గుర్రం లక్ష్మీ నర్సింహ్మరెడ్డి, రాగిరామశ్రీ సహదేవ్, కస్తూరి లక్ష్మీనారాయణ,కటకం శ్రీనివాస్‌లకు సేవా పురష్కారాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంజీ యూనివర్శిటి మాజీ రిజిస్ట్రార్ కట్టా ముత్యంరెడ్డి, తెలంగాణరాష్ట్ర హోటల్స్ అసోసియేషన్ రాష్ట్ర చైర్మన్ సద్ది వెంకట్‌రెడ్డి, బండిరాజులుశంకర్, పెండెం సత్యనారాయణ, మామిడాల చంద్రశేఖర్, గడ్డం నరసింహరెడ్డి, సోమ సీతారాములు,రామాంజనేయులు,ఎస్‌ఎన్‌చారి,జిల్లా రచయితల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు పోరెడ్డి రంగయ్య, బండారు జయశ్రీ, మెరుగు సదానందం, లింగారెడ్డి, బండారు శ్రీనివాస్‌రావు, శంకర్ పాల్గొన్నారు.
సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ