
నేడు ఈద్ – ఉల్– ఫితర్
భువనగిరిటౌన్: పవిత్ర రంజాన్ మాసం ముగిసింది. శవ్వాల్ నెల ప్రారంభ సూచిగా ఆదివారం సాయంత్రం నెలవంక దర్శనం ఇవ్వడంతో ముస్లింలు రంజాన్‌కు సిద్ధమయ్యారు. సోమవారం ఈద్– ఉల్– ఫితర్ నిర్వహించుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈమేరకు ఈద్గాలు, మసీదులను ముస్తాబు చేశారు.
ఈద్–ఉల్–ఫితర్ చరిత్ర..
నెల రోజులపాటు రంజాన్ దీక్షలు పాటించిన ముస్లింలు పవిత్ర మాసం అనంతరం షవ్వాల్ నెల మొదటి రోజు నిర్వహించుకునే పండుగే ఈద్–ఉల్–ఫితర్. నమాజ్ చేసిన అనంతరం ఇష్రాఖ్ సమయం ప్రారంభమైన తర్వాత ఈద్–ఉల్–ఫితర్ రెండు రకాలుగా నమాజ్ చేస్తారు.
ఫిత్రా దానం
ఈద్– ఉల్ – ఫితర్ రోజున ప్రార్థనలకు ముందు పేదలకిచ్చే దానమే ఫిత్రా. సమాజంలోని నిరుపేదలు, దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారికి ఈ దానం చేస్తారు. పావు తక్కువ రెండు కిలోల గోధుమల తూకానికి సరిపడా పైకాన్ని నిరుపేదలకు దానం చేయాలి.
ఈద్– ఉల్– ఫితర్ నమాజ్ ప్రత్యేకం
ఈద్– ఉల్– ఫితర్ నమాజ్ కోసం ఈద్గాలు, మసీదులను ముస్తాబు చేశారు. ఫజర్ నమాజ్ అనంతరం ఇష్రాఖ్ నమాజ్ సమయం ప్రారంభమైన తర్వాత నమాజ్ చేస్తారు. ఇమామ్‌లు ఈద్– ఉల్– ఫితర్ గురించి ఉపదేశించి నియమాలు వివరిస్తారు. నమాజ్ అనంతరం ఖుద్బాను పఠిస్తారు. ఒకరికొకరు రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకుంటారు.
ముగిసిన ముస్లింల ఉపవాస దీక్షలు
ప్రత్యేక ప్రార్థనలకు
ముస్తాబైన ఈద్గాలు