జేఈఈ మెయిన్స్‌లో ‘జయ’ విద్యార్థుల విజయభేరి | - | Sakshi
Sakshi News home page

జేఈఈ మెయిన్స్‌లో ‘జయ’ విద్యార్థుల విజయభేరి

Published Sun, Apr 20 2025 1:53 AM | Last Updated on Sun, Apr 20 2025 1:53 AM

జేఈఈ

జేఈఈ మెయిన్స్‌లో ‘జయ’ విద్యార్థుల విజయభేరి

సూర్యాపేటటౌన్‌: జేఈఈ మెయిన్స్‌–2025 ఫలితాల్లో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జయ జూనియర్‌ కళాశాల విద్యార్థులు విజయభేరి మోగించారు. కళాశాలకు చెందిన 58 మంది జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు అర్హత సాధించినట్టు కళాశాల కరస్పాండెంట్‌ జయ వేణుగోపాల్‌ తెలిపారు. కళాశాల విద్యార్థులు కన్నా ఉజ్వన్‌ గణితంలో 99.969 పర్సంటైల్‌ సాధించినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా జి.తేజశ్రీ ఆలిండియా 1622వ ర్యాంకు, కె.ఉజ్వన్‌ 2254వ ర్యాంకు, వి.బిందుమాధవి 2541వ ర్యాంకు, సీహెచ్‌.హన్షితశ్రీ 2651వ ర్యాంకు, బి.శివమణి 2769వ ర్యాంకు, జె.మేనక 8319వ ర్యాంకు, డి.జగదీషారాజు 9498వ ర్యాంకు, పి. ప్రేమ్‌చందర్‌ 9863వ ర్యాంకు సాధించారు. ప్రతిభ కనపరిచిన విద్యార్థులతో పాటు అధ్యాపక బృందాన్ని కరస్పాండెంట్‌ జయవేణుగోపాల్‌, డైరెక్టర్లు జెల్లా పద్మ, బింగి జ్యోతి అభినందించారు.

‘ప్రగతి’ విద్యార్థులకు అత్యుత్తమ ర్యాంకులు

నల్లగొండ: జేఈఈ మెయిన్స్‌–2025 ఫలితాల్లో నల్లగొండ పట్టణంలోని ప్రగతి జూనియర్‌ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. శనివారం ప్రకటించిన ఫలితాల్లో జాతీయ స్థాయిలో వివిధ కేటగిరీల్లో కళాశాలకు చెందిన విద్యార్థులు వి. శ్రీనిధి రాథోడ్‌ 79వ ర్యాంకు, జంపాల అభినవ్‌ 155వ ర్యాంకు, కల్లేపల్లి సమీరా 4738వ ర్యాంకు, రమావత్‌ సందీప్‌ 4854వ ర్యాంకు, కె. స్టాలిన్‌ 13,358వ ర్యాంకు, టి. కార్తీక్‌ 13,822వ ర్యాంకు, బి. భవాని 14,118వ ర్యాంకు, డి. సునీల్‌నాయక్‌ 19,990వ ర్యాంకు సాధించారు. తమ కళాశాల నుంచి 95 మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు అర్హత సాధించినట్లు కళాశాల యాజమాన్యం తెలిపారు. ఇంటర్‌లో అధిక మార్కులతో పాటు జేఈఈలో ఆలిండియా ర్యాంకులు సాధించిన విద్యార్థులను, వారికి సహకరించిన తల్లిదండ్రులను, అధ్యాపక బృందాన్ని కళాశాల చైర్మన్‌ చందా కృష్ణమూర్తి, డైరెక్టర్లు ఎ. నరేంద్రబాబు, ఎ. శశిధర్‌రావు, చందా శ్రీనివాస్‌, పైళ్ల రమేష్‌రెడ్డి అభినందించారు.

‘గౌతమి’ విద్యార్థుల ప్రభంజనం

నల్లగొండ: జేఈఈ మెయిన్స్‌ ఫలితాల్లో నల్లగొండ పట్టణంలోని గౌతమి జూనియర్‌ కళాశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. శనివారం ప్రకటించిన జేఈఈ మెయిన్స్‌ ఫలితాల్లో జాతీయ స్థాయిలో వివిధ కేటగిరీల్లో కళాశాలకు చెందిన విద్యార్థులు జి. నితీష్‌రెడ్డి 370వ ర్యాంకు, ఎం. శివాజి 2396వ ర్యాంకు, ఐ. రికిత్‌ 5582వ ర్యాంకు, జి. తేజస్విని 6,174వ ర్యాంకు, ఆర్‌. శ్రీకర్‌ 6,916వ ర్యాంకు, ఎ. శశివంత్‌ 8,468వ ర్యాంకు, పి. రాజశేఖర్‌ 9,241వ ర్యాంకు, ఎం. సింహాద్రి 10,497వ ర్యాంకు, ఎం. శ్రీను 10,769వ ర్యాంకు, డి. పూజిత 11,444వ ర్యాంకు, కె. జయచంద్ర 12,233వ ర్యాంకు, ఎస్‌. భావన 13,706వ ర్యాంకు, జె. చంద్రకోటి 14,923వ ర్యాంకు, ఎం. సాత్విక్‌రెడ్డి 15,558వ ర్యాంకు, బి. శశిధర్‌ 15,688వ ర్యాంకు, కె. ప్రణయ్‌ 17,535వ ర్యాంకు, ఆర్‌. శివతేజ 18,385వ ర్యాంకు, ఎం. అక్షయ్‌ వర్షిత్‌ 18,797వ ర్యాంకు, ఆర్‌. అభినవ్‌ రాథోడ్‌ 19,137వ ర్యాంకు సాధించారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులను కళాశాల డైరెక్టర్లు కాసర్ల వెంకట్‌రెడ్డి, చల్లా వెంకటరమణ, కొమ్మిరెడ్డి రఘుపాల్‌రెడ్డి, పుట్ట వెంకటరమణారెడ్డి అభినందించారు.

జేఈఈ మెయిన్స్‌లో ‘జయ’ విద్యార్థుల విజయభేరి1
1/8

జేఈఈ మెయిన్స్‌లో ‘జయ’ విద్యార్థుల విజయభేరి

జేఈఈ మెయిన్స్‌లో ‘జయ’ విద్యార్థుల విజయభేరి2
2/8

జేఈఈ మెయిన్స్‌లో ‘జయ’ విద్యార్థుల విజయభేరి

జేఈఈ మెయిన్స్‌లో ‘జయ’ విద్యార్థుల విజయభేరి3
3/8

జేఈఈ మెయిన్స్‌లో ‘జయ’ విద్యార్థుల విజయభేరి

జేఈఈ మెయిన్స్‌లో ‘జయ’ విద్యార్థుల విజయభేరి4
4/8

జేఈఈ మెయిన్స్‌లో ‘జయ’ విద్యార్థుల విజయభేరి

జేఈఈ మెయిన్స్‌లో ‘జయ’ విద్యార్థుల విజయభేరి5
5/8

జేఈఈ మెయిన్స్‌లో ‘జయ’ విద్యార్థుల విజయభేరి

జేఈఈ మెయిన్స్‌లో ‘జయ’ విద్యార్థుల విజయభేరి6
6/8

జేఈఈ మెయిన్స్‌లో ‘జయ’ విద్యార్థుల విజయభేరి

జేఈఈ మెయిన్స్‌లో ‘జయ’ విద్యార్థుల విజయభేరి7
7/8

జేఈఈ మెయిన్స్‌లో ‘జయ’ విద్యార్థుల విజయభేరి

జేఈఈ మెయిన్స్‌లో ‘జయ’ విద్యార్థుల విజయభేరి8
8/8

జేఈఈ మెయిన్స్‌లో ‘జయ’ విద్యార్థుల విజయభేరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement