
రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు
చిట్యాల: విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై చిట్యాల పట్టణంలోని పాలకేంద్రం సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. వివరాలు.. రామన్నపేట మండలం ఉత్తటూరు గ్రామానికి చెందిన దాసరి యోగేంద్ర విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై చిట్యాల పట్టణ కేంద్రంలో నిర్మిస్తున్న ఫ్లైఓవర్ వద్ద ప్రమాదాలు జరగకుండా వాహదారులకు సూచనలు చేసేందుకు గాను కాంట్రాక్టర్ వద్ద పనిచేస్తున్నాడు. బుధవారం పాలకేంద్రం సమీపంలో విధులు నిర్వహిస్తున్న యోగేంద్రను టాటా ఏస్ వాహనం ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం అంబులెన్స్‌లో నల్లగొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.