
అకాల వర్షం.. ఆగమాగం
ఫ పలు మండలాల్లో భారీ వర్షం
ఫ కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం
చౌటుప్పల్ : వరుసగా కురుస్తున్న వర్షాలు అన్నదా తను కొలుకోకుండా చేస్తున్నాయి. జిల్లాలోని పలు మండలాల్లో ఆదివారం ఈదురుగాలుతో కూడిన భారీ వర్షం రైతులకు తీవ్రనష్టాన్ని మిగిల్చింది. చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ యార్డులో పదుల సంఖ్యలో ధాన్యం రాశులు తడిసి ముద్దయ్యాయి. ఆరబెట్టిన వడ్లు కొట్టుకుపోయాయి. ఆరుగాలం శ్రమించి పండించిన పంట కళ్లెదుటే కొట్టుకుపోతుండగా కొందరు రైతులు విలపించారు. మాయిశ్చర్ వచ్చి తూకం వేయాల్సిన ధాన్యం కూడా తడిసి ముద్దయ్యింది. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు కోరారు.
చౌటుప్పల్ రూరల్ : పెద్దకొండూరుతో పాటు పలు గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. మ్యాయిచర్ కోసం ఎండబెట్టిన ధాన్యం కొట్టుకుపోయింది.తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతు సంఘం రాష్ట్ర నాయకుడు బూర్గు కృష్ణారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.
భూదాన్‌పోచంపల్లి : శివారెడ్డిగూడెం, గౌస్‌కొండ గ్రామాల్లో ధాన్యం పాక్షికంగా తడిసింది. రేవనపల్లి శివారులో చేతికొచ్చిన వరిచేను నేలకొరిగింది. బీజేపీ, సీపీఎం నాయకులు తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
బొమ్మలరామారం : మండలంలోని హాజీపూర్, నాగినేనిపల్లి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశుల కిందికి వర్షపు నీరు చేరడంతో రైతులు అవస్థలు పడ్డారు. కొనుగోలు ప్రారంభించకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
వలిగొండ : చాలా గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది. జాప్యం చేయకుండా కొనుగోళ్లు ప్రారంభించాలని, తడిసిన ధాన్యాన్ని షరతులు లేకుండా కొనుగోలు చేయాలని సీపీఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి డిమాండ్ చేశారు.
సంస్థాన్ నారాయణపురం: మండల వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశుల కిందికి వర్షపు నీరు చేరింది. ఉదయం ఏడు గంటల సమయంలో వర్షం కురవడం, రైతులు వడ్లకుప్పలపై పట్టాలు కప్పి ఉండచంతో పెద్దగా నష్టం జరగలేదు.

అకాల వర్షం.. ఆగమాగం

అకాల వర్షం.. ఆగమాగం

అకాల వర్షం.. ఆగమాగం

అకాల వర్షం.. ఆగమాగం