
బైక్‌ను ఢీకొన్న కారు.. వ్యక్తి దుర్మరణం
వేములపల్లి: బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని కారు ఢీకొనడంతో మృతిచెందాడు. ఈ ఘటన నార్కట్‌పల్లి–అద్దంకి రహదారిపై వేములపల్లి మండల కేంద్రంలో మంగళవారం జరిగింది. ఎస్‌ఐ డి. వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ పట్టణం తాళ్లగడ్డకు చెందిన మందడి వేణుగోపాల్‌రెడ్డి(47) మంగళవారం ఉదయం బైక్‌పై నల్లగొండ సమీపంలోని మర్రిగూడలో ఉంటున్న తన బంధువు ఇంటికి వెళ్లాడు. సాయంత్రం తిరిగి మిర్యాలగూడకు వస్తుండగా.. వేములపల్లి మండల కేంద్రంలోకి రాగానే స్థానిక జెడ్పీ హైస్కూల్ పక్క వీధి నుంచి ఒక్కసారిగా బ్లాక్ స్కార్పియో కారు వచ్చి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వేణుగోపాల్‌రెడ్డికి తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి భార్య మందడి ప్రణీత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు తెలిపారు. మృతునికి ఒక కుమార్తె ఉంది.