
వైఎస్సార్‌టీయూసీ జెండాను ఆవిష్కరిస్తున్న కమలాపురం ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్‌రెడ్డి
కడప కార్పొరేషన్: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కార్మికుల పక్షపాతిగా పనిచేస్తోందని కమలాపురం ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. మే డే సందర్భంగా స్థానిక వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో వైఎస్సార్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు ఎం. జాషువా ఆధ్వర్యంలో జెండాను ఎగురవేశారు. అనంతరం కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ సందర్భంగా రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ ఎంతో మంది త్యాగాల ఫలితంగా కార్మికులకు 8 గంటల పనిదినాలు లభించాయన్నారు. అందుకు గుర్తుగా మే డే జరుపుకుంటున్నామన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత చేతి వృత్తుల వారికి, ఆటో డ్రైవర్లకు, రజకులు, టైలర్లకు ప్రతి ఏటా ఆర్థిక సాయం అందిస్తున్నారన్నారు. మహిళా సంఘాలకు వైఎస్సార్ ఆసరా, తోపుడు బండ్లు, బుట్ట వ్యాపారస్తులకు జగనన్న తోడు కింద ఆర్థిక సాయం అందిస్తున్నట్లు చెప్పారు. కార్మికులకు మేలు జరగాలంటే మళ్లీ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే రావాలన్నారు. జగనన్నకు మళ్లీ సీఎం చేయడానికి కార్మికులంతా కంకణబద్దులు కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఏపీ సోషల్ వెల్ఫేర్‌బోర్డు ఛైర్మెన్ పులి సునీల్ కుమార్, సీకే దిన్నె జెడ్పీటీసీ నరేన్ రామాంజులరెడ్డి, వైఎస్సార్‌టీయూసీ నగర అధ్యక్షుడు నాగరాజు, మేసా ప్రసాద్, పార్టీ నాయకులు బంగారు నాగయ్య, సీహెచ్ వినోద్, త్యాగరాజు, ఆర్‌వీ రమణ, సుబ్బారెడ్డి, రత్నకుమారి, టీపీ వెంకట సుబ్బమ్మ, ఉమామహేశ్వరి, అధిక సంఖ్యలో ఆటో కార్మికులు పాల్గొన్నారు.
కమలాపురం ఎమ్మెల్యే
పి. రవీంద్రనాథరెడ్డి